బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సీక్వెల్!

బాలీవుడ్ కథానాయ‌కుడు షాహిద్ క‌పూర్ హీరోగా అభిషేక్ చౌబే తెర‌కెక్కించిన `ఉడ్తా పంజాబ్ అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే;

Update: 2025-03-06 12:30 GMT

బాలీవుడ్ కథానాయ‌కుడు షాహిద్ క‌పూర్ హీరోగా అభిషేక్ చౌబే తెర‌కెక్కించిన `ఉడ్తా పంజాబ్ అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈచిత్రం 100 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 40 కోట్ల బ‌డ్జెట్లో బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్-ఫాంట‌మ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో రూపొందిన చిత్ర‌మిది. పంజాబ్ లో పాతుకుపోయిన మాద‌క ద్ర‌వ్యాలు రాజ‌కీయ క‌థాంశం ఆధారంగా తెర‌కెక్కించారు.

సినిమా మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ ఒకే టెంపోలో తీసుకెళ్లి ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని అందించారు. అయితే ఈ సినిమాని మ‌రీ రా అండ్ ర‌స్టిక్ గా తీయ‌డంతో కొన్నివిమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. స‌మాజంలో యువ‌త‌ని చెడు అంశాలు ప్రేరేపించేలా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. అయినా వాటితో ప‌ని లేకుండా ఉడ్తాపంజాబ్ దుమ్ము దులిపేసింది.

అప్ప‌ట్లో ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని కూడా వ్య‌క్త‌మైంది. కానీ ఎందుక‌నో సాద్య ప‌డ‌లేదు. అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. `ఉడ్తా పంజాబ్ 2`కు సంబంధించి షాహిద్ క‌పూర్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. స‌రికొత్త క‌థ‌తో ఈ సీక్వెల్ ని అశోక్ కౌశిక్ తెర‌కెర‌క్కిం చాల‌ని స‌న్నాహాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ద‌శ‌లో ఈ ప్రాజెక్ట్ ఉంది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారుట‌. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ బాలీవుడ్లో ప‌లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈఏడాదంతా ఆ ప్రాజెక్ట్ ల‌తోనే బిజీగా ఉంటాడ‌ని స‌మాచారం.

Tags:    

Similar News