'తెలివైనోళ్లైతే థియేటర్ నుంచి వెళ్లిపోండి'

కన్నడ నటుడు కమ్ దర్శకుడు ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అంటే చాలు.. అంతా భారీ అంచనాలు పెట్టుకుంటారు.

Update: 2024-12-20 05:39 GMT

కన్నడ నటుడు కమ్ దర్శకుడు ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అంటే చాలు.. అంతా భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఉపేంద్ర తీసిన చిత్రాలు.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. ఆడియన్స్ ను తెగ అలరిస్తాయి. అలా తెలుగులో కూడా ఆయన స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు.

ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత యూఐ మూవీతో నేడు థియేటర్లలోకి వచ్చారు ఉపేంద్ర. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యూఐ సినిమా తెరకెక్కించినట్లు రిలీజ్ కు ముందు మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. టీజర్, ట్రైలర్ ను చూస్తే.. యూఐ మూవీ ఊహించని స్టోరీతో రూపొందినట్లు క్లియర్ గా అర్థమైపోయింది.

దీంతో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో మేకర్స్ కూడా క్రేజీ ప్రమోషన్స్ చేపట్టారు. తొలిసారి ఉపేంద్ర పాన్ ఇండియా మూవీలో నటించగా.. అందుకు తగ్గట్లే సినిమాను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా కన్నడతో పాటు తెలుగులో తమ ప్రమోషన్స్ ద్వారా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు.

ఇప్పుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యాక.. అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ గా కూడా తన డిఫరెంట్ మేకింగ్ తో అదరగొట్టారని అంటున్నారు. వింటేజ్ ఉపేంద్రను మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చూశామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దాంతోపాటు థియేటర్ లో స్క్రీన్ పై వచ్చిన ఫస్ట్ డిస్క్లైమర్ కోసం నెట్టింట పోస్టులు పెడుతున్నారు. 'మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుంచి బయటకు వెళ్లండి' అంటూ డిస్క్లైమర్ వేశారు ఉపేంద్ర. దీంతో అది చూసి థియేటర్లలో ఒక్కసారిగా షాకయ్యామని, ఉపేంద్ర మాస్ అలా ఉంటుందని చెబుతున్నారు.

అయితే డిస్క్లైమర్ కు సంబంధించిన పిక్ ను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు సినీ ప్రియులు. క్లాసిక్ ఉపేంద్ర స్టైల్ అలాగే ఉంటుందని కొనియాడుతున్నారు. చిన్న గ్యాప్ మాత్రం వచ్చింది కానీ.. ఆయన టాలెంట్ లో ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్నారు. ఉపేంద్ర ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. మరి మీరు యూఐ సినిమా చూశారా? ఎలా అనిపించింది?

Tags:    

Similar News