ఆ దేశానికి తొలి ఆస్కార్ ఇదే

స‌రిగ్గా ఇవే స‌న్నివేశాల్ని డాక్యుమెంట‌రీగా చిత్రీక‌రించి ఏకంగా ఆస్కార్ అవార్డునే అందుకున్నారు. ఉక్రెయిన్ దేశ చ‌రిత్ర‌లో తొలి ఆస్కార్ అవార్డు అదే అయింది.

Update: 2024-03-12 12:30 GMT

ఓవైపు భీక‌ర‌మైన యుద్దం..ఎటు నుంచి ఏ బాంబు మీద ప‌డుతుంతో తెలియ‌దు? ఏప్రాణం ఎప్పుడు పోతుందో తెలియ‌దు? గుండె గుప్పెట్లో బ్ర‌త‌కాల్సిన స‌మ‌యం అంది. ర‌ష్యా భీక‌ర దాడిలో ఉక్రెయిన్ ఎలా అతలా కుత‌ల‌మైందో తెలిసిందే. స‌రిగ్గా ఇవే స‌న్నివేశాల్ని డాక్యుమెంట‌రీగా చిత్రీక‌రించి ఏకంగా ఆస్కార్ అవార్డునే అందుకున్నారు. ఉక్రెయిన్ దేశ చ‌రిత్ర‌లో తొలి ఆస్కార్ అవార్డు అదే అయింది.

అవును! ఆ రెండు దేశాల మ‌ధ్య యుద్దంతోనే ఉక్రెయిన్ కి ఆస్కార్ వ‌రించింది. 140 కోట్ల భార‌తీయుల ఆశ‌ల్ని మోస్తూ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో పోటీ ప‌డ్డ 'టూ కిల్ ఏ టైగ‌ర్' అవార్డు గెలుచుకోలేక పోయింది. కానీ ఇదే విభాగంలో '20 డేస్ ఇన్ మ‌రియోపోల్' ఆస్కార్ కైవ‌సం చేసుకుంది. ర‌ష్యా రెండ‌ళ్ల కింద‌ట ఉక్రెయిన్ ని ఆక్ర‌మించిన స‌మయంలో అక్క‌డ దారుణ ప‌రిస్థితుల్ని ఈ డాక్యుమెంట‌రీలో చూపించారు. దీన్ని ఉక్రెయిన్ కి చెందిన ప్రముఖ పాత్రికేయుడు మిస్లావ్ చెర్నోవ్ తెర‌కెక్కించారు.

ఉక్రెయిన్ చ‌రిత్ర‌లో మొద‌టి ఆస్కార్ అవార్డు ఇది. మాతృభూమి కోసం వీరోచితంగా పోరాడిన సైన్యం ..ర‌ష్యా సేన‌ల‌కు ఎదురొడ్డిన ఉక్రెయిన్ పౌరుల‌కు ఆ ఆస్కార్ అంకితం అంటూ అవార్డు స్వీక‌రిస్తోన్న స‌మ‌యంలో క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు మిస్లావ్. 20 రోజుల పాటు యుద్ద రంగంలో ఉండి ఈ డాక్యుమెంట‌రీని రూపొందించాడు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. 'మా న‌గ‌రాల‌ను ఆక్ర‌మించ‌కుండా ..మా ఉక్రెయిన్ పై దాడులు చేయ‌కుండా బ‌ధులుగా రష్యా వారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చ‌రిత్ర‌ను..గ‌తాన్ని మార్చ‌లేను. కానీ కొంద‌రు ప్ర‌తిభావం తుల‌తో క‌లిసి కొత్త చ‌రిత్ర‌ను సృష్టించ‌గ‌లం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాల్ని త్యాగం చేసిన మ‌రియోపోల్ ప్ర‌జ‌లు గుర్తిండిపోతారు. సినిమా జ్ఞాప‌కాల‌ను ఏర్ప‌రుస్తుంది. జ్ఞాప‌కాలు చ‌రిత్ర‌ను నెల‌కొ ల్పుతాయి' అంటూ ఉద్విగ్నంగా స్పందించారు.

Tags:    

Similar News