వివాదంలో ఐసీ814..కంటెంట్ హెడ్ కి సమన్లు!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ `ఐసీ 814: ది కాంధార్ హైజక్` పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ `ఐసీ 814: ది కాంధార్ హైజక్` పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర సమాచారశాఖ, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ప్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కి సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ వివాదానికి దారి తీసిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ గా పేరొందిన కాంధార్ హైజాక్ నేపథ్యంలో దీన్ని రూపొందించారు. కెప్టెన్ దేవిశరణ్, శ్రింయజ్ చౌదురి రాసిన పుస్తకం `ప్లైట్ ఇన్ టూ ఫియర్` ఆధారంగా అనుభవ్ సిన్హా ఈ ఘటనలకు దృశ్య రూపం ఇస్తూ `ఐసీ 814: ది కాంధార్ హైజాక్` వెబ్ సిరీస్ ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు.
176 మంది ప్రయాణికులతో కాట్మాండ్ నుంచి దిల్లీకి బయలు దేరిన ఐసీ 814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్ ని తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్ ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేసారు?
వారు చేసిన డిమాండ్లను నేర వేర్చుకునే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదుర య్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్నది సిరీస్. ఇటీవల రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.