అన్ స్టాపబుల్ 3… ఈ సారి గెస్టులు ఎవరంటే?

ఈ సారి అన్ స్టాపబుల్ సీజన్ 3లో గెస్ట్ లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొనే అవకాశం ఉందంట.

Update: 2024-08-21 04:08 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహ ఓటీటీలో స్టార్ట్ అయిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలకృష్ణ సెలబ్రెటీ గెస్ట్ లతో తనదైన శైలిలో మాట్లాడుతూ వినోదాన్ని పండిస్తూనే, కావాల్సిన ఇన్ ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేయడంతో హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. దీంతో అన్ స్టాపబుల్ ఓటీటీలలో అత్యధిక వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్న షోగా నిలిచింది.

అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీజన్ 2 కూడా చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయ్యింది. నెక్స్ట్ లెవల్ లో ట్రెండ్ సెట్ చేసింది. అన్ స్టాపబుల్ సీజన్ 2లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు. అయిన కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆహ యాజమాన్యం అన్ స్టాపబుల్ సీజన్ 3కి ఏర్పాట్లు చేస్తోంది. బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ షోకి ఏర్పాట్లు చేస్తున్నారంట.

త్వరలో దీనికి సంబందించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సారి అన్ స్టాపబుల్ సీజన్ 3లో గెస్ట్ లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొనే అవకాశం ఉందంట. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున కూడా గెస్ట్ లుగ వస్తారంట. ఎన్టీఆర్ కూతుళ్లు బ్రాహ్మణి, తేజశ్వనితో పాటు అల్లుళ్ళు లోకేష్, శ్రీ భరత్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

అయితే సీజన్ 3లో మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే మాట వినిపిస్తోంది. మెగాస్టార్ గెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ గా ఒకే షోలో కనిపిస్తే కచ్చితంగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. నాలుగు నెలల పాటు అన్ స్టాపబుల్ సీజన్ 3 టాక్ షో సందడి ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 త్వరలో బాలకృష్ణ ప్రారంభించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Tags:    

Similar News