క్లీంకార నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది

రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు ఇటీవల పాపకు తల్లిదండ్రులు అయ్యారు

Update: 2023-08-08 06:27 GMT

రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు ఇటీవల పాపకు తల్లిదండ్రులు అయ్యారు. గత నెలలో పాపకు కొణిదెల మరియు కామినేని ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో పాపకి క్లీంకార అనే పేరును పెట్టడం జరిగింది. సాధారణంగా ఒక మహిళ జీవితం తల్లిగా మారిన తర్వాత పరిపూర్ణం అవుతుందని చాలా మంది అంటూ ఉంటారు. ఉపాసన కూడా అవే వ్యాఖ్యలు చేసింది.

క్లీంకారకి జన్మనిచ్చిన తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన ఉపాసన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లీంకార పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పు వచ్చిందన్నారు. పాప సంరక్షణలో తనకు ఎప్పుడు కూడా సాయం చేస్తూ తోడు ఉండే భర్త నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఉపాసన పేర్కొంది.

జీవితం విలువను నాకు క్లీంకార తెలియజేసిందని ఉపాసన అన్నారు. తన పాప వల్ల ఎన్నో కొత్త విషయాలను నేను నేర్చుకుంటున్నాను. ఎన్నో విషయాల పట్ల అవగాహణ పెంచుకుంటున్నట్లుగా కూడా ఉపాసన పేర్కొన్నారు. క్లీంకార రాకతో తమ ఫ్యామిలీ లో ఆనందం మరింత ఎక్కువ అయిందని కూడా ఆమె తెలియజేశారు.

బిడ్డకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంతగానో తల్లడిల్లి పోతారు. ఆ బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారిన తర్వాత వారికి సంతోషం కలుగుతుంది. అలాంటి మధుర క్షణాలను తల్లిదండ్రులకు అందిస్తున్న డాక్టర్ లకు ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.

పిల్లలకు చిన్న సమస్య వచ్చినా కూడా వారిని చూసుకోవడం చాలా రిస్క్‌ తో కూడిన పని. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొందరు పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా సింగిల్ మదర్‌ లు ఈ విషయం లో ఎంతగా కష్టపడుతున్నారో తాను అర్థం చేసుకోగలను అంటూ ఉపాసన ఆవేదన వ్యక్తం చేసింది.

అందుకే సింగిల్‌ మదర్‌ లకు కొంతలో కొంత అయినా సహాయం చేసేందుకు తన వంతు అన్నట్లుగా ఓపీడీ చికిత్సను అపోలోలో ఉచితంగా అందించబోతున్నాం. ఒంటరి తల్లులకు ఈ చికిత్సను ఉచితంగా అందించడం వల్ల వారికి కొంత మేరకు అయినా సహాయంగా నిలిచిన వాళ్లం అవుతామని ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News