స్టార్ హీరో అసహనం..వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?
అయితే ఈ రెండు సినిమాల్లో మ్యాక్స్ భారీ విజయం సాధించినట్లు తెలుస్తోంది. వికీ సమాచారం ప్రకారం ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
శాండిల్ వుడ్ లో ఉపేంద్ర- కిచ్చా సుదీప్ అగ్ర హీరోలుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహి తులని అంటారు. నటుడిగా సుదీప్ కంటే ఉపేంద్ర సీనియర్. ఈ నేపథ్యంలో ఉపేంద్రని సుదీప్ గురువుగాను భావిస్తారంటారు. ఇటీవలే ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఉపేంద్ర నటించిన `యూఐ` డిసెంబర్ 20న రిలీజ్ అవ్వగా, 25న సుదీప్ నటించిన `మ్యాక్స్` రిలీజ్ అయ్యాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో మ్యాక్స్ భారీ విజయం సాధించినట్లు తెలుస్తోంది. వికీ సమాచారం ప్రకారం ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఐదు రోజుల్లోనే సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకి అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నట్లు తెలుస్తోంది. `యూఐ` మాత్రం నిరాశ పరిచినట్లే కనిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 30 కోట్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర `యూఐ` సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
అయితే ఈ కార్యక్రమంలో ఉపేంద్ర అసహనం వ్యక్తం చేసారు. ఓ రిపోర్టర్ `మ్యాక్స్` కారణంగా `యూఐ` కలెక్షన్లు డ్రాప్ అయ్యాయా? అంటే ఉప్పీ ఆసక్తికరంగా మాట్లాడారు.` నాకు కేవలం `యూఐ` మాత్రమే తెలుసన్నారు. సుదీప్ సినిమా గురించి మాట్లాడలేదు. మాట్లాడటానికి ఇష్టపడినట్లు కూడా కనిపించలేదు. దీంతో మీడియా వర్గాల్లో ఇదో చర్చగా మారింది. సుదీప్- ఉపేంద్ర మధ్య ఏమైనా క్లాషెష్ వచ్చాయా అంటూ మాట్లాడుకుంటున్నారు.
సుదీప్ కన్నడలో అగ్ హీరో. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. పైగా తాజా సినిమా మ్యాక్స్ ఏకంగా కేజీఎఫ్ తర్వాత 500 కోట్ల వసూళ్ల చిత్రంగా కనిపిస్తుంది. అంత పెద్ద సినిమా అయినప్పుడు ఉపేంద్రకు ఆ సినిమా గురించి తెలియకుండా ఉంటుందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపేంద్ర సమాధానం వెనుక అసలు కారణం ఏంటి? అన్నది తెలియాలి. ఆయన స్పందన మీద సుదీప్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.