ఉపేంద్రని ఆశ్చర్యపరచిన డైరెక్టర్..!

ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా నటుడు ఉపేంద్ర లిమయె తన నరేషన్ చూసి ఆశ్చర్యపోయారని అన్నాడు అనిల్ రావిపూడి.

Update: 2025-01-17 14:30 GMT

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి చేసిన ఎనిమిది సినిమాల్లో 3 సినిమాలు వెంకటేష్ తోనే చేసి హిట్ అందుకున్నాడు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా నటుడు ఉపేంద్ర లిమయె తన నరేషన్ చూసి ఆశ్చర్యపోయారని అన్నాడు అనిల్ రావిపూడి. యానిమల్ సినిమా ఐదారు సార్లు చూడగా అందులో ఉపేంద్ర నటన తనకు నచ్చిందని అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆయన పాత్ర రాశానని అన్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ ని బాగా అర్థం చేసుకుని పాత్ర చెప్పాను. అప్పుడు ఆయన నిజంగానే షాక్ అయ్యారని అన్నారు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి తను రాసుకున్న పాత్ర పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యేందుకు కృషి చేస్తుంటారు. లిమిటెడ్ బడ్జెట్ లో అనుకున్న టైం కు అనుకున్న విధంగా సినిమా తీసి హిట్లు కొడుతుంటారు. లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రెండు గంటల 24 నిమిషాలు పర్ఫెక్ట్ సినిమాగా మలిచారు. ఐతే ఒక ఐదారు నిమిషాలు తప్ప ఎక్స్ ట్రా ఫుటేజ్ ఏమి ఉండదని చెప్పి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

సినిమాకు షూటింగ్ డేట్స్ తక్కువ అయితే బడ్జెట్ తక్కువ అవుతుంది. ఐతే తక్కువ రోజుల్లో చేస్తున్నాం కదా అని ఏదో మమా అనిపించడం కాదు తాను రాసుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తారు అనిల్ రావిపూడి. అందుకే ఆయన సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. సంక్రాంతికి వస్తున్నాం తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న అనిల్ నెక్స్ట్ కూడా బిగ్ స్టార్స్ తో లైనప్ పెట్టుకున్నాడు. ఎలాగు ఓటమి ఎరుగని దర్శకుడు కాబట్టి ఏ స్టార్ హీరో అయినా ఛాన్స్ ఇచ్చేస్తాడు. అనిల్ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత తన లైన్ లో కింగ్ నాగార్జున కూడా ఉన్నారని టాక్.

Tags:    

Similar News