UI టీజర్.. ఉపేంద్ర 2040 కథ!
ఇప్పుడు కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆయన UI సినిమా చేస్తున్నారు. వినూత్నమైన ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.
కన్నడ హీరో ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే చాలు.. అందులో విభిన్నమైన కథ, వినూత్నమైన స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆయన UI సినిమా చేస్తున్నారు. వినూత్నమైన ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.
లహరి ఫిల్మ్స్ జి మనోహరన్, వీనస్ ఎంటర్టైనర్స్ కేపీ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాలో ఉపేంద్ర సరసన రీష్మా నటిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే యూఐ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్.. వార్నర్ పేరుతో టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. సినిమా విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన తెలుగుతో పాటు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో క్రిస్మస్ బరిలో మరో సినిమా దిగనట్లైంది. ప్రస్తుతం యూఐ మూవీ టీజర్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
టీజర్ లో 2040లో ప్రపంచం ఎలా ఉండనుందో మేకర్స్ చూపించారు. ఆకలి తీర్చుకోవడానికి ప్రజల ప్రయత్నాలు, మనుషుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఉపేంద్ర పవర్ ఫుల్ రోల్ లో ఎంట్రీ ఇస్తారు. ఆయనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ సమయంలో మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తి రేపాయి.
అనేక సమస్యలు, యుద్ధాలు తర్వాత 2040లో అసలు భూమి ఎలా ఉంటుంది? ప్రజలు ఎలా జీవిస్తారు? భూమిని క్యాపిటలిస్టులు లాక్కుని నాశనం ఎలా చేశారు? అనే అంశాల చుట్టూ యూఐ సినిమా అంతా తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. అయితే టీజర్.. బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు. ఉపేంద్ర టాలెంట్ మరోసారి చూసేందుకు వెయిటింగ్ అని అంటున్నారు.
టీజర్ కు అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ అసెట్ గా మారింది. మనోహరన్, శ్రీకాంత్ కేపీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అయితే యూఐ చిత్రంలో రీష్మ ననైయ తోపాటు సన్నీలియోన్, జిషు సేన్ గుప్త, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మరి యూఐ మూవీతో ఉపేంద్ర ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.