'ఊప్స్ అబ్ క్యా' సిరీస్.. పబ్లిక్ టాక్ ఇలా..

నిన్నటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Update: 2025-02-21 10:03 GMT

శ్వేత బసు ప్రసాద్, ఆశిమ్ గులాటి లీడ్ రోల్స్ లో ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో దేవాత్మ మండల్, ప్రేమ్ మిస్త్రీ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఆ సిరీస్.. 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. నిన్నటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి సిరీస్ స్టోరీ ఏంటి? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

కథ ఇలా.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన శ్వేతా బసు ప్రసాద్ ఓ హోటల్ లో ఫ్లోర్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటుంది. అమ్మ, అమ్మమ్మే తన జీవితంగా బతుకుతుంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ఓంకార్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే హోటల్ ఓనర్ కొడుకు సమర్ ఉంటాడు. అప్పటికే అతడికి పెళ్లి అయ్యి భార్య ఉంటుంది. కానీ ఇబ్బందులు ఉంటాయి.

ఆమె తన భర్త ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. కానీ తన భర్త స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చాలని అనుకుంటుంది. అప్పుడే ఆ స్పెర్మ్ శ్వేత గర్భంలోకి ప్రవేశపెడుతుంది డాక్టర్. దీంతో ఓంకార్ షాక్ అవుతాడు. అప్పుడే హోటల్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ విషయంలో సమర్ గానీ .. అతని భార్య గాని హత్య చేసి ఉండొచ్చని ఓంకార్ భావిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సిరీస్.

అయితే మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ లో ఫస్ట్ మూడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూడు ఎపిసోడ్స్ పై ఆధారపడే మిగతా ఎపిసోడ్స్ నడుస్తాయని చెబుతున్నారు. అయితే ఫ్యామిలీ నేపథ్యంలోని సీన్స్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కామెడీ టచ్ ఇంకాస్త మెరుగ్గా ఇస్తే బాగుండు అనిపిస్తోందని అంటున్నారు.

అదే సమయంలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా బాగున్నాయని చెబుతున్నారు. కథను మరీ డీటేల్డ్ గా చెప్పడానికి ప్రయత్నించారేమో అనిపిస్తుందని అంటున్నారు. ప్రధానమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులంతా మెప్పించారని చెబుతున్నారు. శ్వేతా బసు ప్రసాద్ ఆదరగొట్టారని, సోనాలి కులకర్ణి బలమైన పాత్రలో అద్భుతంగా నటించారని చెబుతున్నారు. ఆశిమ్ గులాటి తన లుక్స్, నటనతో మెప్పించారని చెబుతున్నారు.

టెక్నికల్ విషయానికొస్తే.. జార్జ్ జాన్ పనిక్కర్ కెమెరా పనితనం బాగుందని కొనియాడుతున్నారు. ముఖ్యంగా స్టోరీకి తగ్గట్లే రిచ్ నెస్ ను తీసుకురావడంలో ఆయన కీలక పాత్రను పోషించారని చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. వినోదాత్మక స్క్రీన్‌ప్లే, మంచి కథాంశం ఉందని చెబుతున్నారు. కొన్ని విషయాల్లో మాత్రం మైనస్ పాయింట్స్ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరి మీరు ఆ సిరీస్ చూశారా?

Tags:    

Similar News