12 కేజీల లెహంగా కింద‌కి ఎలా జారిపోతుందంటే?

ఉర్పీ జావెద్ వింతైన డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌కంటూ ఓ స్టైల్ ని..బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.

Update: 2024-04-04 09:38 GMT

ఉర్పీ జావెద్ వింతైన డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌కంటూ ఓ స్టైల్ ని..బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. అలాంటి వైవిధ్య‌మైన డిజైన్స్ ని వ‌ర‌ల్డ్ లో మ‌రో మ‌హిళ ధ‌రించ‌దేమో అన్నంత‌గా ఉంటాయి. తాను ఏం చేసినా ఇన్నోవేటివ్ గా ఉండాల‌నే ఉర్పీ అలా ట్రై చేస్తుంటుంది. అలా చేసింది కాబ‌ట్టే మార్కెట్ లో స‌క్సెస్ అయింది...నిల‌బ‌డ‌గ‌లిగింది అన్న‌ది అంతే వాస్త‌వం. ఉన్న పోటీ ని త‌ట్టుకుని నిల‌వాలంటే? అలా కొత్త‌గా ట్రై చేస్తే త‌ప్ప నేటి సోష‌ల్ యుగంలో స‌ర్వైవ‌ల్ అవ్వ‌డం క‌ష్టమైన ప‌ని.


తాజాగా ఓ న‌టి ఫోటోషూట్ కోసం పెద్ద సాహ‌స‌మే చేసింద‌నిపిస్తుంది. ఆ సాహ‌స‌మే నెట్టింట్ ట్రెండింగ్ నిలిపింది.


ఇదిగో ఇక్క‌డ ఓ బ్యూటీ ఇలా ఏకంగా 12 కేజీల లెహంగానే ధ‌రించింది. లెహంగా ధ‌రిస్తున్న స‌మ‌యంలో తానెంత అసౌక‌ర్యానికి గుర‌వుతుంది. 12 కేజీలు బ‌రువుని ఒంటిమీద వేసుకుని మోయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో? ఇందులో చూస్తేనే తెలుస్తుంది. ఆ లెహంగాని తొడ‌గ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ మెన్ డిజైన‌ర్ వెంట ఉన్నాడు.

అత‌డే ద‌గ్గ‌రుండి లెహంగాని ఆ న‌టి ఒంటిపై స‌ర్దుతున్నాడు. ముస్తాబైన త‌ర్వాత లెహంగా హెవీ వెయిట్ కి ఒంటిమీద నుంచి కింద‌కు జారిపోతుంది. ఆ స‌మ‌యంలో స‌ద‌రు బ్యూటీ జార‌కుండా ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుతం ఆ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీంతో కింద కామెంట్ బాక్సులో పోస్టులు అంతే ఆస‌క్తిక‌రంగా మారాయి. ఫోటో షూట్ లో స‌ద‌రు న‌టి క‌ష్టాన్ని అంతా గుర్తించారనిపిస్తుంది.

గ్లామ‌ర్ వ‌రల్డ్ లో నెగ్గుకు రావాలంటే? ఏన‌టికైనా సావాస‌మే..సాహ‌స‌మే అనాలి. పోటీని త‌ట్టుకుని మార్కెట్ లో నిల‌బ‌డాలంటే ఇలా ఇన్నోవేటివ్ షూట్లు త‌ప్ప‌నిస‌రి. క్రియేటివ్ హెడ్ ప్లానింగ్ తో పాటు స‌ద‌రు న‌టి అంత గొప్ప‌గా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే సాధ్య‌మైంది. దీంతో ఆమె ప్ర‌య‌త్నాన్ని నెటి జ‌నులు ప్ర‌శంసిస్తున్నారు.

Tags:    

Similar News