తెరపైకి బోల్డ్ నటి రియల్ లైఫ్
సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నటిగా ఇప్పటి వరకు పెద్ద సినిమాలు, సిరీస్ లు చేయకున్నా, పెద్ద విజయాలు దక్కించుకోలేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోయింగ్ ను దక్కించుకుంది.
తన విభిన్నమైన డ్రెస్ లు, తన విభిన్నమైన మాట తీరు కారణంగా ఉర్ఫీ జావేద్ పదే పదే వార్తల్లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి కాస్ట్యూమ్స్ ను కూడా వాడుతారా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరి కొందరు ఈమె ఆలోచనలు ఏంట్రా బాబు అంటూ విమర్శించారు.
ఆ విభిన్నమైన డ్రెస్సింగ్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఏకంగా అమెజాన్ ప్రైమ్ లో ఆమె రియల్ లైఫ్ షో స్ట్రీమింగ్ అయ్యేలా చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు ఉర్ఫీ జావేద్ తో ఫాలో కర్ లో యార్ అనే షో ను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
ఈ షో లో సోషల్ మీడియా సెలబ్రెటీగా ఉండటం ఎంత కష్టం.. ఫాలోవర్స్ ను పొందడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలను ఉర్ఫీ తో ఈ షో లో చెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షో తర్వాత ఉర్ఫీ మరింతగా పాపులర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.