సెల్ఫీ క్వీన్ ఊర్వశి భంగిమ కిల్లింగ్
ఇప్పుడు పసుపు రంగు బాడీ హగింగ్ డ్రెస్ ని తొడుక్కుని సెల్ఫీలకు ఫోజులిస్తూ కనిపించింది.;

నిరంతరం ఏదో ఒక ప్రత్యేక విషయంతో ఊర్వశి వార్తల్లో నిలుస్తోంది. ఇంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలతో లేదా ఐటమ్ నంబర్లతో వెబ్ లో చర్చగా మారింది. ఇటీవల వరుస ఫోటోషూట్లతో చర్చల్లోకొస్తోంది. తాజాగా ఊర్వశి రౌతేలా తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకుని పేదలకు ఆహారం అందించే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.

ఆకలితో ఉన్నవారికి జిలేబీ వడ్డిస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఊర్వశి భారీ సంఖ్యలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు పసుపు రంగు బాడీ హగింగ్ డ్రెస్ ని తొడుక్కుని సెల్ఫీలకు ఫోజులిస్తూ కనిపించింది. ఊర్వశి నాభి అందాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకోగా పలుచోట్ల ముత్యాలతో అలంకరణ మతులు చెడగొట్టింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. డాకు మహారాజ్ విజయంతో ఊర్వశి ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ `వెల్కమ్ 3`తో బిజీగా ఉంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, రవీనా టాండన్, దిశా పటాని, సునీల్ శెట్టి, లారా దత్తా, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరేష్ రావల్, అర్షద్ వార్సీ, రాజ్‌పాల్ యాదవ్, జానీ లివర్, శ్రేయాస్ తల్పాడే, తుషార్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ లో మొదటి చిత్రం `వెల్కమ్` 2007లో విడుదలైంది. దీని తర్వాత 2015లో `వెల్కమ్ బ్యాక్` వచ్చింది. దీనితో పాటు ఊర్వశి వివేక్ చౌహాన్ `బాప్`లోను నటించనుంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎక్స్‌పెండబుల్స్ రీమేక్‌గా చెబుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, లంకేష్ భరద్వాజ్, అపేక్ష పాండే, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి , జానీ లివర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. పర్వీన్ బాబీ బయోపిక్ లోను ఊర్వశి నటించనుందని తెలుస్తోంది.