ఊర్వశి మరోసారి దబిడి దిబిడి చూశారా!
తాజాగా ఈ పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.;

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఆ సినిమాలోని ఐటెం సాంగ్ దబిడి దిబిడి వార్తల్లో నిలిచింది. కొందరు పాటను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం ఆ స్టెప్స్ ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొత్తంగా డాకు మహారాజ్ సినిమాలోని ఆ దబిడి దిబిడి హాట్ టాపిక్‌గా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లో కీలక పాత్ర పోషించింది. ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనూ దబిడి దిబిడి సాంగ్ వల్లే మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. ఊర్వశి రౌతేలా మరో ఐటెం సాంగ్‌తో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ మూవీ జాట్‌లో ఈమె చేసిన టచ్ కియా పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'జాట్' సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జాట్ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఊర్వశి రౌతేలాతో ఐటెం సాంగ్ టచ్ కియా ఉండబోతుంది. తాజాగా ఈ పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అయిన గంటలోనే పాటకు మిలియన్ వ్యూస్ దక్కాయి. 24 గంటలు గడవక ముందే రెండు మిలియన్‌ల వ్యూస్‌ను ఈ పాట దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
డాకు మహారాజ్ సినిమాకు దబిడి దిబిడి ఏ స్థాయిలో క్రేజ్‌ను తెచ్చి పెట్టిందే అదే విధంగా జాట్ సినిమాకు టచ్ కియా సాంగ్ సైతం అదే విధంగా క్రేజ్ తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్ డాన్స్‌కి వస్తున్న విమర్శల కారణంగా ఈ పాట కొరియోగ్రఫీ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి రౌతేలా మరోసారి తనదైన శైలి డాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టబోతుంది అంటూ ఈ పాటను చూసి ప్రేక్షకులు అంటున్నారు. జాట్ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పాట మేకింగ్ వీడియోలో రెజీనాను సైతం చూపించడంతో ఆమె కూడా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
జాట్ సినిమా కథను మొదట టాలీవుడ్ హీరోతో చేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావించాడు. కానీ బడ్జెట్ ఇష్యూస్ కారణంగా తెలుగులో ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఆ హీరో తప్పుకోవడంతో అతే కథ, అదే దర్శకుడితో మైత్రి మూవీ మేకర్స్ వారు హిందీలో సన్నీ డియోల్ హీరోగా సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా, సయామీ ఖేర్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అంచనాలు భారీగా పెంచే విధంగా ఉంది. ఈ సినిమాకు ఎక్కువగా తెలుగు టెక్నీషియన్స్ వర్క్ చేయడం విశేషం. జాట్ ను తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.