సినిమా ఓపెనింగులో CM స్థాయి వ్యక్తికి ఇది తగునా?
విక్రాంత్ మాస్సే చిత్రం `ఆంఖోన్ కి గుస్తాఖియాన్` ప్రారంభోత్సవ వేడుక కు రాష్ట్ర ముఖ్యమంత్రి ధామి ముఖ్య అతిథిగా విచ్చేయడం స్టార్లతో ఫోటోలు దిగడం ఆశ్చర్యపరిచింది.
ముఖ్యమంత్రులుగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు లేదా వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వంటి వారిని ఏదైనా సినిమా లాంచ్ ఈవెంట్లలో చూడటం దాదాపు అసాధ్యం. ఏదైనా ప్రత్యేక కారణం ఉండి రేర్ కాన్సెప్ట్ అయితేనే కానీ సీఎం స్థాయి వ్యక్తులు సినిమా వేడుకలకు వచ్చేందుకు ఆస్కారం లేదు. కానీ ఉత్తరాఖండ్ లో ఒక సాధారణ సినిమా ప్రారంభోత్సవానికి కూడా ఇది సాధ్యం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఓ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా విక్రాంత్ మాస్సే లాంటి స్టార్ సినిమా పూజా కార్యక్రమానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ఆశ్చర్యపరిచారు.
విక్రాంత్ మాస్సే చిత్రం `ఆంఖోన్ కి గుస్తాఖియాన్` ప్రారంభోత్సవ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ధామి ముఖ్య అతిథిగా విచ్చేయడం స్టార్లతో ఫోటోలు దిగడం ఆశ్చర్యపరిచింది. నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి తన శాసనసభ విధుల నుండి తగినంత సమయం తీసుకోవడం నిజంగా ప్రజలను ఆశ్చర్యపరిచింది.
కళల్ని, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వాల విధి. కాదనలేం. కానీ ఇలా ప్రజా సేవకులైన నాయకులు తమ అత్యంత విలువైన సమయాన్ని ఇష్టానుసారం ఖర్చు చేయడంపైనే పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనికంటే రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు, కళాకారులకు అవసరం మేర వనరుల సమీకరణ ఏర్పాటు, నైపుణ్య అభివృద్ధికి ఇనిస్టిట్యూట్ల ఏర్పాటు వంటి పనులపై ముఖ్యమంత్రి దృష్టి సారించి ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా ఓపెనింగుకి సీఎం హాజరు టూమచ్ అంటూ దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని బీజేపీ ప్రచారార్భాటం అంటూ విమర్శిస్తున్నారు. సీఎం వస్తున్నారు అంటే పార్టీ నాయకుల సందడి మామూలుగా ఉండదు. ఈ హంగామా చూశాక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు!!
విక్రాంత్ మాస్సే సినిమాలో షానయా కపూర్ కథానాయికగా నటిస్తోంది.