నిన్ను ఎప్పటికీ నా లైఫ్ ఆర్కైవ్‌లో దాచేస్తా: రాశీ
గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో తారగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాశీ ఖన్నా ఎంతో హార్డ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే
గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో తారగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాశీ ఖన్నా ఎంతో హార్డ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తనకంటూ ఒకే బేస్ ఉంది. కోలీవుడ్, హిందీలోను తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు రాశీలో కెరీర్ ఆలోచనలతో పాటు, సామాజిక తత్పరత, పర్యావరణ స్పృహ ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. నేడు రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా రాశీ యాక్టివిటీస్ కొన్ని అభిమానుల్లో చర్చకు వచ్చాయి. విపరీతమైన పార్టీలు, విలాసవంతమైన బహుమతుల కల్చర్‌కు బదులుగా రాశి ఖన్నా తన పుట్టినరోజున పర్యావరణంపై శాశ్వత ప్రభావాన్ని చూపే విధంగా వేడుకల్ని జరుపుకోవాలని భావించింది. తన పుట్టినరోజున చెట్లను నాటడం సంప్రదాయంగా మారింది. ప్రతి పుట్టినరోజున ఒక మొక్కను నాటడం ద్వారా బర్త్ డేని సముచిత వేడుకగా మార్చింది. నా కంటిని సంతోషపెట్టడానికి, నా ఆత్మను సంతోషపెట్టడానికి, కొద్దిగా బాధ్యత వహించడానికి ఈ దారిలో నాకు దక్కే ఆనందం కోసం. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతున్న మరొక పుట్టినరోజు అంటూ ఎమోషనల్ గా వ్యాఖ్యను జోడించింది. రాశీ ఖన్నా పచ్చని మొక్కను నాటుతున్న ఫోటోలు అంతర్జాలంలో ఇప్పటికే వైరల్ గా మారాయి.
ఇంతలోనే రాశీ ఖన్నా తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న మరో ఫోటో అంతర్జాలంలో వైరల్ అయింది. రాశీ బర్త్ డే అంటే వాణీ ఉండాల్సిందే కదా! తన చెంతే ఉండి బోలెడంత సందడి చేసింది వాణీ కపూర్. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో ఈ విషయం బయటపడింది. ఈ ఫోటోని షేర్ చేసిన రాశీ దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. ''నిన్ను ఎప్పటికీ నా లైఫ్ ఆర్కైవ్‌లో భద్రపరుస్తున్నాను'' అని అందమైన క్యాప్షన్ ఇచ్చింది.
వాణి కపూర్ నాకు కుటుంబం లాంటిది: రాశి
వాణీ కపూర్ తో రాశీ ఖన్నా స్నేహానుబంధం గురించి ఇప్పటికే అభిమానులకు స్పష్ఠంగా తెలుసు. ఆ ఇద్దరూ కెరీర్ ఆరంభం నుంచి రూమ్ మేట్స్. మంచి స్నేహితులు. వాణి -నేను దాదాపు దశాబ్ద కాలంగా స్నేహితులం అని రాశి ఖన్నా గతంలో వెల్లడించారు. రాశి ఖన్నా లేదా వాణి కపూర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను అనుసరిస్తుంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఎక్కువగా గమనించవచ్చు. వాణితో ఎలా స్నేహం కుదిరింది? అని రాశీని అడిగేస్తే.. ఇలా చెప్పింది.
''వాణి - నేను దాదాపు ఒక దశాబ్దం పాటు స్నేహితులం. నేను తనను మొదటిసారిగా ఢిల్లీలో టీవీసీ కోసం ఆడిషన్లో కలిశాను. అప్పటి నుండి మేము ఎల్లప్పుడూ కలిసి ఉన్నాము. నిజానికి, మేము ముంబైలో ఏడాదిన్నర పాటు కలిసి ఉన్నాము. ఆ తర్వాత మా స్నేహం మరింత బలపడింది. వాణీ నాకు కుటుంబం లాంటిది''అని తెలిపింది. వాణి ఇప్పుడు ముంబైలో .. రాశి హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ విహారయాత్రకు కలిసి ప్లాన్ చేస్తారు. ఇదే విషయమై రాశీ మాట్లాడుతూ ''ఇటీవల సింగపూర్ వెళ్ళాము. వాణి నేను ప్లాన్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇప్పుడు మా షెడ్యూల్స్‌తో ఇది చాలా కష్టంగా మారింది. తను ఇప్పుడు రెండు పెద్ద బాలీవుడ్ సినిమాలు చేస్తోంది, వాణీ చాలా బిజీగా ఉందని నాకు తెలుసు. నేను కూడా ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను. కానీ షూట్ల మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కోసం ప్లాన్ చేస్తాము. ఒకవేళ అలా చేయడం చాలా కష్టంగా ఉంటే, నేను తనను ముంబైలో కలుస్తాను. లేదా నన్ను చూడటానికి తనే హైదరాబాద్‌కు వస్తుంది''అని రాశి చెప్పారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విక్రాంత్ మాస్సేతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది రాశీ. అలాగే అజయ్ దేవగన్ తో కలిసి నటించిన సైకలాజికల్-థ్రిల్లర్ 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' OTTలో విడుదల కానుంది. షాహిద్ కపూర్ ఫర్జీలో తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ధర్మ ప్రొడక్షన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'యోధా'లో నటించింది.