తారక్ ప్రభాస్ చరణ్.. ఇప్పుడు వైష్ణవ్!

అయితే చాలా మంది హీరోలు వీరి స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోవడానికి మాస్ కథలని ఎంచుకుంటూ ఉంటారు.

Update: 2023-11-21 04:14 GMT

ఇండస్ట్రీలో హీరోలు ఎవరికైనా స్టార్ ఇమేజ్ తీసుకోచ్చేది మాస్ కమర్షియల్ కథలే. ఈ కథలతోనే రామ్ చరణ్, తారక్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు అందరూ కెరియర్ ఆరంభంలో మాస్ కథలు చేసి సక్సెస్ లు అందుకున్న వారే. ఆ సినిమాలు ఈ రోజు వారి పాన్ ఇండియా ఇమేజ్ ని పునాదులు అని కచ్చితంగా చెప్పొచ్చు. రామ్ చరణ్ కెరియర్ లో, చిరుత, రచ్చ, ఎవడు, అల్లు అర్జున్ కి బన్నీ, తారక్ కి ఆది, ప్రభాస్ కి ఛత్రపతి సినిమాలు ఒక మైలు రాళ్ళుగా నిలిచాయి.

అయితే చాలా మంది హీరోలు వీరి స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోవడానికి మాస్ కథలని ఎంచుకుంటూ ఉంటారు. కాని ఈ ఫార్ములా అందరికి వర్క్ అవుట్ కాదు. రామ్ పోతినేని రీసెంట్ గా స్కంద అని చేసి డిజాస్టర్ కొట్టారు. ఈ తరం హీరోలు అలాంటి కమర్షియల్ టెంప్లెట్ లో కథలతో మూవీస్ చేసిన ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి మూవీస్ చూడటానికి ఇష్టపడటం లేదు.

కొత్తదనం ఉన్న కథలకి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. మాస్, కమర్షియల్ అంటూ రొటీన్ ఫార్మాట్ లో అందరికి తెలిసిన కథని ఎన్ని రకాలుగా తిప్పి చూపించిన తిరస్కరిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ ఫార్మాట్ లో రొటీన్ మాస్ కమర్షియల్ మూవీస్ పెద్దగా సక్సెస్ లు అందుకున్న దాఖలాలు కూడా లేవు. ఒక్క వాల్తేర్ వీరయ్య మాత్రమే ఈ ఏడాదిలో ఆ టైపు కథలతో వచ్చి సక్సెస్ అందుకున్న సినిమా.

ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా స్టార్ హీరోలు కెరియర్ ఆరంభంలో ఫాలో అయిన మాస్ కమర్షియల్ టచ్ ఉన్న కథని ఆదికేశవతో చేశారు. సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ ఫార్మాట్ లో మూవీస్ చేసిన సక్సెస్ రాలేదు. విరూపాక్షతో కొత్తగా ట్రై చేసి హిట్ కొట్టాడు. అయితే ఉప్పెన తర్వాత రెండు సినిమాలు చేసిన వైష్ణవ్ కి సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో కాస్తా టోన్ మార్చి మాస్ హీరోగా రంగంలోకి దిగాడు.

ఆదికేశవ మూవీ ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూస్తే హీరోయిన్ తో లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ తో పాటు రాయలసీమ నేపథ్యంలో మాస్ యాక్షన్ టచ్ కూడా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత పంక్తు కమర్షియల్ మూవీ అని అర్ధమవుతోంది. మరి ఈ మూవీతో వైష్ణవ్ తేజ్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News