మేనల్లుళ్ల గురించి స్టార్ హీరో దిగులు..!

ఇద్దరు మెగా హీరోలు ఇలా కెరీర్ లో అనుకోని రిస్క్ లో పడటం మెగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇద్దరు అల్లుళ్ల విషయంలో చిరంజీవి కూడా దిగులు చెందుతున్నారని తెలుస్తుంది.

Update: 2024-02-08 09:40 GMT

మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా ఫ్యాన్స్ వాళ్లని కూడా అక్కున చేర్చుకుంటారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం తో హిట్ అందుకుని మెగా ఛరిష్మాతో కెరీర్ కొనసాగిస్తున్నాడు. మరోపక్క వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరాడు. మేనల్లుళ్ల గురించి ఇక ఆలోచించాల్సిన పని లేదని చిరంజీవి అనుకున్నారు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అందుకే యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ లో ఏదో మిస్సింగ్ అనే ఆలోచన ఫ్యాన్స్ లో ఉంది.

యాక్సిడెంట్ ముందు వరకు సాయి ధరం తేజ్ దూకుడు చూపించాడు. ఆఫ్టర్ యాక్సిడెంట్ అతనిలో ఆ స్పార్క్ లేదు. విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ బ్రో తో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత సినిమా ఒకటి మొదలై ఆగిపోయిందని తెలుస్తుంది. తేజ్ సినిమా ఆగిపోవడం ఏంటని మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మరోపక్క వైష్ణవ్ తేజ్ కెరీర్ పరిస్థితి కూడా ఏమి బాగాలేదు. ఉప్పెన హిట్ పడిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత 3 సినిమాలు చేస్తే మూడు కూడా నిరాశ పరిచాయి. నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ సినిమా ఏంటన్నది కూడా తెలియట్లేదు. ఇద్దరు మెగా హీరోలు ఇలా కెరీర్ లో అనుకోని రిస్క్ లో పడటం మెగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇద్దరు అల్లుళ్ల విషయంలో చిరంజీవి కూడా దిగులు చెందుతున్నారని తెలుస్తుంది.

తన సినిమాలతో చిరు సూపర్ బిజీగా ఉండగా మరోపక్క మేనల్లుళ్ల కెరీర్ గురించి చిరు కాస్త డిస్టర్బ్ అవుతున్నారట. అప్పటికీ సాయి తేజ్ కి పవన్ కళ్యాణ్ సాయం చేయాలని ప్రయత్నించినా ఆ సినిమా వల్ల పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. సాయి ధరం తేజ్ తో కూడా చిరు బ్రో డాడీ సినిమా రీమేక్ అనుకున్నారు కానీ తనకు రీమేక్ లు ఇచ్చిన షాక్ ల వల్ల చిరు ఇక మీదట వాటి జోలికి వెళ్లకూడదు అనుకున్నాడు. ఎలాగైనా సరే మళ్లీ అల్లుళ్ల కెరీర్ ట్రాక్ మీదకు తెచ్చేలా చిరు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి మెగాస్టార్ పర్యవేక్షణలో సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా లేదా అన్నది చూడాలి.


Tags:    

Similar News