వక్కంతం పరిస్థితి ఏంటిప్పుడు?
స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్టర్ గా అతడు చేసిన ప్రయోగాల గురించి తెలిసిందే.
స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్టర్ గా అతడు చేసిన ప్రయోగాల గురించి తెలిసిందే. తొలి ప్రయత్నంగా ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `నా పేరు సూర్య` తెరకెక్కించి ఎలాంటి ఫలితాలు చూసాడో తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమా కంటెంట్ మంచిదే అయినా యాంగర్ మేనేజ్ మెంట్ ని బేస్ చేసుకుని తెరకెక్కిం చిన సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. కానీ కమర్శియల్ గా వర్కౌట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
ఆ తర్వాత వంక్కంతం రెండవ సినిమా ఛాన్స్ కోసం ఎంతలా శ్రమించాడో తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత యూత్ స్టార్ నితిన్ అవకాశం ఇచ్చాడు. అదే ఇటీవల రిలీజ్ అయిన `ఎక్స్ ట్రా ఆర్డీనరీ`. ఈ సినిమా ఫలితం గురించి కూడా తెలిసిందే. తొలి సినిమా డిఫరెంట్ గా చేసి చేతులు కాల్చుకున్న వంశీ రెండవ ప్రయత్నం మాత్రం పక్తు కమర్శియల్ అంశాలు జొప్పించి నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డీనరీ చేసాడు. కానీ ఈ సినిమా ఫలితం అంతకు మించి నిరాశని మిగిల్చింది.
తొలి సినిమా విషయంలో కొన్ని ప్రశంసలైనా దక్కాయి. కానీ రెండవ సినిమా విషయంలో ఆసినిమా చేసింది వక్కంతమేనా? అన్న సందేహం కలిగేలా చేసాడు. రాకరాక వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాడని..తిరుగులేని సక్సెస్ అందుకుంటాడని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ అన్నింటిని వంశీ వమ్ము చేసాడు. రొటీన్ సినిమా చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు.
మరి ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి అంటే? ఇప్పట్లో ఛాన్సు కష్టమనే అనాలేమో అనే టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్ల పాటు ఆయన మళ్లీ స్టోరీ రైటర్ గానే బిజీ అయ్యే అవకాశం ఉందంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్నారు. డైరెక్టర్ లోచాలా విషయాలు పరిగణలోకి తీసుకుని ఛాన్సులు ఇస్తున్నారు. వక్కంతం నితిన్ తో ఆ తరహా సినిమా తీయకుండా ఓ గొప్ప అవకాశం వచ్చేదని..కానీ ఇప్పుడా ఛాన్స్ కోల్పోయినట్లేనని అంటున్నారు ఆయన ఫాలోవర్స్. మరి వీటన్నింటికి వంశీ ఎలాంటి ముగింపు ఇస్తాడో చూడాలి.