వరలక్ష్మి పెళ్లి సందడి.. మెహందీలో హబ్బీతో హ్యాపీగా
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈవెంట్ అతిథి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
వరలక్ష్మి శరత్‌కుమార్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను జూలై 2న థాయ్‌లాండ్‌లో వివాహం చేసుకోనున్నారు. చెన్నైలో రంగుల మెహందీ వేడుకతో ఇప్పటికే వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సన్నిహితులు కుటుంబ సభ్యుల నడుమ జరుగుతున్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈవెంట్ అతిథి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఆకుపచ్చ-పసుపు రంగు లెహంగాలో పెళ్లికూతురు అందంగా కనిపించింది. నికోలాయ్ ఆకుపచ్చ కుర్తా దుస్తులను ధరించారు. వరూ- సచ్ దేవ్ జంట ఎంతో ఆనందంగా కనిపించారు ఈ ఫోటోషూట్ లో.
మెహందీ వేడుకలో వరూ ఎంతో చిల్లింగ్ గా కనిపించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకకు థీమ్ ఆకుపచ్చ. వరలక్ష్మి, నికోలాయ్ కాకుండా చాలా మంది అతిథులు ఇదే రంగు దుస్తులు ధరించారు. అందులో ఒక ఫోటోలో వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్ రాధిక శరత్‌కుమార్‌తో కలిసి జాయ్ ఫుల్ గా పోజులిచ్చారు. మెహెందీ వేదిక వద్ద అతిథులతో కలిసి విజయ్ అప్పాడి పోడుకు శరత్‌కుమార్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానం:
ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వరలక్ష్మి తన పెళ్లికి ఆహ్వానించారు. ఆమె పిఎం మోడీతో పాటు తన కాబోయే భర్త, తన తండ్రి ,రాధికా శరత్‌కుమార్‌తో వరుస ఫోటోలను షేర్ చేసింది. ప్రధానిని ఆహ్వానించిన తర్వాత, దంపతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకున్నారు. ఆమెను వివాహానికి ఆహ్వానించారు. తెలుగు, తమిళం సహా ఇతర చిత్రపరిశ్రమల నుంచి తన స్నేహితులు, సన్నిహితులను వరలక్ష్మి స్వయంగా పెళ్లికి ఆహ్వానించారు. రేపటి పెళ్లి వేడుక స్టార్ స్టడెడ్ ఈవెంట్ గా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
వరలక్ష్మి తన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, నయనతార, సమంతా రూత్ ప్రభు, అనుపమ్ ఖేర్, రవితేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, బాలా, ప్రభు, వంశీ పైడిపల్లి, థమన్ ఎస్, గోపీచంద్ మలినేని, నయనతార, విఘ్నేష్ శివన్, కిచ్చా సుదీప్, సిద్ధార్థ్ వంటి ప్రముఖులను ఆహ్వానించింది.
ఇటీవల గలాట్టా తో వరలక్ష్మి మాట్లాడుతూ- ''తనకు కాబోయే భర్త తనను బాగా నవ్విస్తాడని, నా కెరీర్‌కు మద్దతు ఇస్తాడని పేర్కొంది. ఎల్లప్పుడూ నాకు మొదటి స్థానంలో ఉంటాడు. అతడు నన్ను చాలా ప్రేమగా, విలాసంగా ప్రేమగా రక్షించేవాడు. మేము ఆహారం విషయంలో ప్రేమగా కలిసి షేర్ చేసుకుంటాం. అతడు నా మాటలను కూడా పూర్తి చేస్తాడు. 14 సంవత్సరాల క్రితం కలుసుకున్నాము. తక్షణమే మా మధ్య ఏదో ఉందని అర్థమైంది. కానీ మేము అప్పుడు డేటింగ్ చేయలేదు. స్నేహితులుగా సన్నిహితంగా ఉన్నాము. ఇటీవలే ప్రేమ వికసించింది... అని తెలిపింది.