వరలక్ష్మి ప్లానింగ్స్ అన్నీ ఫెయిల్!
కొన్ని చిత్రాల్లో పాజిటివ్ రోల్స్ చేస్తున్నా వాటికన్నా నెగిటివ్ రోల్స్ అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కొలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిశ్రమ ఆమెని విలనీగా గుర్తించింది. హీరోయిన్ గా కంటే ప్రతి నాయకురాలిగా ఆమె గొప్పగా సూటవు తుందని భావించి పరిశ్రమ ఆ రకమైన అవకాశాలతో ప్రోత్సహిస్తుంది. అమ్మడికి హీరోయిన్ గాకంటే ఎక్కువ గుర్తింపు ఆ తరహా పాత్రలతోనే వచ్చిందన్నది వాస్తవం. దీంతో టాలీవుడ్ లోనూ అదే తరహా రోల్స్ వస్తు న్నాయి.
కొన్ని చిత్రాల్లో పాజిటివ్ రోల్స్ చేస్తున్నా వాటికన్నా నెగిటివ్ రోల్స్ అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ప్రేక్షకాభిమానుల నుంచి వినిపిస్తోన్న వెర్షన్. కానీ వరలక్ష్మి మాత్రం ఈ విషయంలో చాలా అసంతృప్తిగానే ఉన్నట్లు ఆమె మాటల్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు కెరీర్ విషయంలో ప్రణాళికలు వేసుకోవడం మానేసిందిట. మొదట్లో ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్లాలని అంతా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లినా! ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్లానింగ్ లేకుండా వెళ్తుందిట.
భవిష్యత్ లో కూడా వేయనంటోంది. ఎందుకంటే తాను అనుకున్నది ఏది జరగలేదుట. జీవితంలో ఏం జరిగిపోవాలని ఉంటే అది జరిగిపోతుంది. నిర్ణయాలు కాలానికే వదిలేసినట్లు చెప్పుకొచ్చింది. కెరీర్ విషయంలో ఎలాంటి డ్రీమ్ రోల్స్ కూడా పెట్టుకోలేదంటుంది. శరత్ కుమార్ కొన్ని సలహాలు ఇస్తారుట. కానీ తుదిగా నిర్ణయం తీసుకునేది తానే కాబట్టి వాటి పరిగిణలోకి తీసుకుంటే తీసుకుంటుందిట.
లేకపోతే లేదు అనేసింది. అలాగే భాష గురించి ఏ రోజు ఆలోచించలేదు అంది. ఇంట్రెస్టింగ్ గా అనిపించే పాత్ర ఏ భాష నుంచి వచ్చినా చేసుకుంటూ వెళ్లిపోతున్నా అంది. హిందీ నుంచి చాలా అవకాశాలు వచ్చాయట. కానీ ఏది ఆ సక్తిగా అనిపించకపోవడంతో అక్కడ ఇంకా సినిమాలు చేయలేదు అంటోంది. మొత్తానికి వరలక్ష్మి కాలాన్ని నమ్మి కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్దమతుంతుంది.