వెడ్డింగ్ స్పెషల్ : పుష్ప ని కలిసిన అంజమ్మ
ఏడాదికి అర డజను సినిమాల చొప్పున చేస్తున్న ఈ అమ్మడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తేజ సజ్జా హనుమాన్ సినిమాలో అంజమ్మ పాత్రలో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా మరింత బిజీ అయ్యింది. ఏడాదికి అర డజను సినిమాల చొప్పున చేస్తున్న ఈ అమ్మడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.
39 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కూతురు కాబోతుంది. జులై 2న సుదీర్ఘ కాల ప్రియుడు అయిన నికోలాయ్ సచ్దేవ్ ని వరలక్ష్మి వివాహం చేసుకోబోతోంది. ఆ మధ్య వీరి వివాహ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.
ఇప్పుడు పెళ్లికి అంతకు మించి అన్నట్లుగా టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులను వరలక్ష్మి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తుంది. నేడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు నిర్మాత అల్లు అరవింద్ లను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించింది.
కాబోయే భర్త నికోలాయ్ సచ్దేవ్ తో కలిసి అల్లు వారి ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్ కుమార్ కి సాదర స్వాగతం దక్కింది. అల్లు ఫ్యామిలీ ని వివాహ కార్యక్రమానికి ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
అల్లు అర్జున్ తో సెల్ఫీ తీసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఆయన నుంచి తప్పకుండా పెళ్లికి వస్తాను అనే హామీని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అల్లు అరవింద్ కాబోయే దంపతులకు ఆశీర్వాదం అందించడంతో పాటు పెళ్లికి తప్పకుండా హాజరు అవుతాను అంటూ హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప తో మీట్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.