హీరోయిన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదట!
ఇటీవలే ఈ అమ్మడు నికోలాయ్ సచ్దేవ్ తో పెళ్లి కి సిద్ధం అయ్యింది. ఇద్దరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే
తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి విలన్ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచి, టాలీవుడ్ లో వరుసగా విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
ఇటీవలే ఈ అమ్మడు నికోలాయ్ సచ్దేవ్ తో పెళ్లి కి సిద్ధం అయ్యింది. ఇద్దరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. తమిళ మీడియా వర్గాలతో పాటు పలు జాతీయ మీడియా సంస్థలు కూడా వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం వార్తలను పెద్ద ఎత్తున కవర్ చేశాయి.
తాజాగా ఒక చిట్ చాట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తన పెళ్లి మరియు ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 22 ఏళ్ల వయసులో నేను నటిగా ఎంట్రీ ఇచ్చాను. 28 ఏళ్ల లోపు స్టార్ హీరోయిన్ గా నిలవాలని కోరుకున్నాను.
స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత 32 ఏళ్లకు వివాహం చేసుకోవాలని అనుకున్నాను. 34 ఏళ్లకు పిల్లలకు తల్లి అవ్వాలని భావించాను. కానీ నేను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం నా వయసు 38 ఏళ్లు. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాను... ఎప్పటికి పిల్లలు అవుతారు అనేది చెప్పలేను అన్నట్లుగా వరలక్ష్మి వ్యాఖ్యలు చేసింది.