మోక్షజ్ఞ కోసం అసలు వేట.. వర్మకు బిగ్ చాలెంజ్

మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అవుతున్నారు.

Update: 2024-09-16 13:33 GMT

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి చిత్రం తెరకెక్కనుంది. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే సూపర్ హీరో కథాంశంతోనే ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. పెర్ఫెక్ట్ హీరోయిక్ లుక్ తో మోక్షజ్ఞ ఆకట్టుకుంటున్నాడనే మాట వినిపిస్తోంది.

మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అవుతున్నారు. సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ కాబట్టి అందుకు తగ్గట్లుగానే మూవీ క్యాస్టింగ్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

అందుకే ప్రశాంత్ వర్మ టీమ్ ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉందంట. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ ని మోక్షజ్ఞకి జోడీగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారంట. అలా అయితే కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని భావించినట్లు సమాచారం. అయితే ఎందుకనో మరల ఆ నిర్ణయం మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంట.

చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. మోక్షజ్ఞకి జోడీగా హీరోయిన్ ని వెతకడమే ఇప్పుడు ప్రశాంత్ వర్మకి ఛాలెంజింగ్ టాస్క్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. కచ్చితంగా మోక్షజ్ఞకి సరిపోయే హీరోయిన్ ని అయితే ఈ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అక్టోబర్ నాటికి హీరోయిన్ విషయంలో ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంట.

ఇదిలా ఉంటే మహాభారతంలో అభిమాన్యుడి క్యారెక్టర్ స్ఫూర్తితో మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ కథ సిద్ధం చేసారని టాక్ వినిపిస్తోంది. అయితే సూపర్ హీరో పవర్స్ కోసం ఇందులో ఎలాంటి మైథలాజికల్ ఎలిమెంట్ ని ప్రశాంత్ వర్మ జోడించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News