ఆ హీరోని వెంటాడుతోన్న 'వారం వ్య‌వ‌ధి' వైఫ‌ల్యం!

12 ఏళ్ల కెరీర్ లో ఎన్నో విజ‌యాలు అందుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరోని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది.

Update: 2025-01-24 11:30 GMT

బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో త‌న‌ని తాను స్పెష‌ల్ గా తీర్చిదిద్దుకున్నాడు. యంగ్ హీరోయిన్ల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా మారాడు. యూత్ పుల్ ల‌వ్ స్టోరీలు చేయాల‌న్నా? యాక్ష‌న్ కంటెంట్ తో మెప్పించాల‌న్నాన‌యా డైరెక్ట‌ర్ల‌కు వ‌రుణ్ బెస్ట్ ఆప్ష‌న్ గా మారాడు.

12 ఏళ్ల కెరీర్ లో ఎన్నో విజ‌యాలు అందుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరోని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. ప్ర‌తిగా తాను ప‌ర‌జ‌యాలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. మ‌రి ఈ విష‌యాన్ని వ‌రుణ్ గ‌మ‌నించాడా? లేదా? అన్న‌ది తెలియ‌దుగానీ..తెలిస్తే మాత్రం నా వెనుక ఇంత జ‌రుగుతుందా? అనుకోవ‌డం ఖాయం. ఓసారి ఆ సెంటిమెంట్ లోకి వెళ్తే... అజ‌య్ దేవ‌గ‌ణ్, కాజోల్ న‌టించిన `త‌న్హాజీ` 2020 జ‌న‌వ‌రిలో రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది.

350 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన వారం వ్య‌వ‌ధిలో వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన `స్ట్రీట్ డాన్స‌ర్ 3డీ` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. పెట్టుబ‌డి కూడా రిక‌వ‌రీ చేయ‌లేక‌పోయింది. అటుపై రెండేళ్ల గ్యాప్ అనంత‌రం 2022లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన `దృశ్యం 2` న‌వంబ‌ర్ లో రిలీజ్ అయి భారీ విజ‌యం సాధించింది.

ఈ సినిమా 345 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ త‌ర్వాత స‌రిగ్గా వారం గ్యాప్ లో నే వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన `బేడియా` కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. అటుపై గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో రిలీజ్ అయిన `పుష్ప‌-2` బాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐకాన్ స్టార్ దెబ్బ‌కి ప‌రిశ్ర‌మ ఒణికింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వారం గ్యాప్ లో వ‌రుణ్ న‌టించిన మ‌రో సినిమా `బేబిజాన్` రిలీజ్ అయింది. కానీ ఫలితం నిరాశ‌నే మిగిల్చింది. ఇలా వ‌రుణ్ ని కొంత కాలంగా వారం వ్య‌వ‌ధి వెంటాడుతుంది. ఇలా రిలీజ్ అయిన వ‌రుణ్ సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు.

Tags:    

Similar News