హీరోయిన్ బొడ్డుపై చెయ్యి.. బుగ్గపై ముద్దు.. హీరో వివరణ
ఆ రెండు సందర్భాల్లో హీరోయిన్‌లు పరేషాన్ అయ్యారని కూడా నెటిజనుల్లో గుసగుసలు వినిపించాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరో తన కథానాయికలతో అనుచితంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాపులర్ హీరోయిన్ అనుమతి లేకుండా బుగ్గపై ముద్దాడేయడమే కాకుండా, మరో ప్రముఖ హీరోయిన్ బొడ్డుపైనా అనుచితంగా చెయ్యేశాడని విమర్శిస్తూ నెటిజనులు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వైరల్ చేసారు. అయితే అందులో ఒక ఘటన షూటింగులో ఉన్నప్పుడు సెట్స్ లోనే జరగ్గా, మరొకటి లైవ్ వేదికపైనే జరిగింది. ఆ రెండు సందర్భాల్లో హీరోయిన్‌లు పరేషాన్ అయ్యారని కూడా నెటిజనుల్లో గుసగుసలు వినిపించాయి.
యువహీరో తన కథానాయికలను చూసి టెంప్ట్ అయ్యాడని కూడా సోషల్ మీడియాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఎపిసోడ్ లో కథానాయికలు మరెవరో కాదు.. బుగ్గపై ముద్దు అందుకున్న హీరోయిన్ కియరా అద్వాణీ కాగా, ఆలియా భట్ బొడ్డును వరుణ్ ధావన్ తాకాడని విమర్శలొచ్చాయి. ప్రముఖ హీరో వరుణ్ ధావన్ కి బేబి జాన్ ప్రమోషన్స్ లో త్రోబ్యాక్ ఇన్సిడెంట్స్ గురించి చిక్కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి అతడు ఓపిగ్గా సమాధానాలిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ ఆలియా భట్ బొడ్డు పట్టుకోవడం .. మ్యాగజైన్ కవర్ షూట్ సమయంలో మరో హీరోయిన్ కియారా చెంపపై ముద్దు పెట్టుకోవడం గురించి వరుణ్ ధావన్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. వరుణ్ మాట్లాడుతూ... ఈ ప్రశ్నలు అడిగిన హోస్ట్ ని అభినందిస్తూ.... తన సహనటి కియరాతో ముద్దు ప్లాన్ చేసినది అని తెలిపాడు. కియారా, నేను ఇద్దరూ ఆ క్లిప్‌ని పోస్ట్ చేసాము. ఇది డిజిటల్ కవర్ కోసం ఫోటోషూట్. ఫోటోగ్రాఫర్ మా నుంచి ఏదైనా సంథింగ్ కావాలని అడిగారు. మంచి మూవ్ మెంట్ ని కోరుకున్నారు. కాబట్టి మేం దానిని ప్లాన్ చేసాము. ఆ ముద్దుతో కియారా షాక్ అయినట్లు నావైపు చూస్తుంది.. ఆ సమయంలో ఫ్లాష్ మెరిసిందని తెలిపాడు. కియారా మంచి నటి అని వరుణ్ ప్రశంసించాడు.
జగ్‌జగ్ జీయోను ప్రమోట్ చేస్తున్నప్పుడు కియారాను సరదాగా కొట్టడానికి ప్రయత్నించినప్పుడు విమర్శలొచ్చాయి. ఈ సంఘటనపై వరుణ్ స్పందిస్తూ.. నేను ఉద్దేశపూర్వకంగా చేశాను.. ఇది నా స్వభావం కాదు.. అని కూడా అన్నాడు. ఇవన్నీ ప్రమోషన్స్ కోసం ట్రిక్కులు అని తెలిపాడు. అలియా బొడ్డును తాకడం గురించి అడిగినప్పుడు .. అది సరదాగా చేశానని, అది సరసాలాడటం కాదని వివరణ ఇచ్చాడు. స్పాంటేనియస్ గా జరిగిపోయిన ఘటన అని కూడా అన్నాడు.
వరుణ్ ధావన్ - కీర్తి సురేష్ జంటగా కాలీస్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ జాన్' ఈ బుధవారం థియేటర్లలో విడుదైలంది. దీనిని అట్లీ నిర్మించారు. ఇందులో వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ కూడా నటించారు. రాజ్‌పాల్ యాదవ్, సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలలో నటించారు. రాజ్ & DK సిటాడెల్: హనీ బన్నీలోను వరుణ్ నటించిన సంగతి తెలిసిందే. శశాంక్ ఖైతాన్ రొమాంటిక్ కామెడీ .. డేవిడ్ ధావన్ కామెడీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'లోను వరుణ్ నటిస్తున్నాడు.