విరాట్ కోహ్లీ ఒంటరిగా ఏడుస్తాడు.. స్టార్ హీరో లీకులు..
అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు అని చెప్పాడు ప్రముఖ హీరో వరుణ్ ధావన్.
మైదానంలో గొప్ప ప్రదర్శన ఇచ్చినా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చాక ఎలాంటి భావోద్వేగాలను అనుభవిస్తారో ఎవరికైనా తెలుసా? తన జట్టును గెలిపించినా కానీ, చివరికి తన ఇంట్లో భార్య చెంత కలత చెందే ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు అని చెప్పాడు ప్రముఖ హీరో వరుణ్ ధావన్. మైదానంలోనే కాదు, మైదానం వెలుపల కూడా బలమైన వ్యక్తిత్వం కలిగిన రియల్ హీరోగా కోహ్లీని అతడు అభివర్ణించాడు.
టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరున్న విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో సిరీస్ సమయంలో తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు. 2018లో టెస్ట్ ను 1-4తో కోల్పోయినప్పుడు అతడు అనుష్క శర్మ చెంత తన బాధను వెల్లగక్కాడు. రూమ్ లో ఒంటరిగా కూచుని ఏడ్చాడు. ఉద్వేగాన్ని అణచుకోలేకపోయాడు. ఆ సిరీస్ లో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలతో అత్యధిక స్కోరర్ గా నిలిచినా కానీ, సిరీస్ ని గెలవలేదనే అవమానాన్ని అతడు దిగమింగుకున్నాడు. టీమ్ వైఫల్యాన్ని తనదిగా వోన్ చేసుకుని కలత చెందాడు. కెప్టెన్ గా అతడు ఎంతగా ఒత్తిడిని అధిగమించాడో ఆ సన్నివేశం చెప్పిందని వరుణ్ ధావన్ వెల్లడించారు. కోహ్లి జట్టు వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాడు. ఓటమిని తీవ్ర స్థాయిలో వోన్ చేసుకున్నాడు. అందుకే అతడు తన సతీమణి వద్ద ఎమోషన్ అయ్యాడు అని తెలిపాడు.
అలాగే `సుయిధాగ`లో తన సహనటి అనుష్క శర్మతో షూటింగ్ చేస్తున్న సమయంలో తన అనుభవాలను కూడా అతడు గుర్తు చేసుకున్నాడు. ఓ గ్రామంలో చిత్రీకరణ సమయంలో అనుష్కను ప్రత్యక్షంగా చూసానని.. ఆమె అన్యాయాన్ని సహించలేదని తెలిపాడు. అనుష్క గురించి సాధారణ ప్రజలకు ఏమీ తెలియదు.. ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా ఆమె పట్టించుకోదు.. అని అన్నాడు. చాలా చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక ధోరణి ఉన్న అనుష్క శర్మ చాలా బలమైన మహిళ అని కితాబిచ్చాడు.
అనుష్క శర్మ చాలా కాలంగా సినిమాలకు దూరమైంది. భర్త విరాట్ కోహ్లీ తన పిల్లల ఆలనాపాలన చూసుకుంటోంది. ఇప్పుడు తన పునరాగమన చిత్రం, స్పోర్ట్స్ డ్రామా `చక్దా ఎక్స్‌ప్రెస్` విడుదల కోసం వేచి చూస్తోంది. నిరవధిక ఆలస్యం కారణంగా ఈ చిత్రం చివరికి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. వరుణ్ ధావన్ తదుపరి యాక్షన్ చిత్రం బేబీ జాన్‌లో కనిపించనున్నాడు. ఇది క్రిస్మస్ రోజున విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో వరుణ్ ధావన్ తన కెరీర్ జర్నీలో ఎదురైన చాలా సంగతులను ముచ్చటిస్తున్నాడు.