పిక్ టాక్: భర్తతో లావణ్య క్యూట్ పోజ్
దీంతో తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలొచ్చాయి. అంతరిక్షం సినిమా టైమ్ లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య ప్రేమలో పడింది.;
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాల రాక్షసి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య, మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలొచ్చాయి. అంతరిక్షం సినిమా టైమ్ లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య ప్రేమలో పడింది.
కొన్నాళ్ల పాటూ రహస్యంగా ప్రేమించుకున్న లావణ్య- వరుణ్ గతేడాదిలో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. ఇప్పుడు లావణ్య మెగా కోడలైపోయింది. పెళ్లి తర్వాత తన భర్త వరుణ్ తో కలిసి విదేశాలకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య, మొన్నా మధ్య మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో ప్రేక్షకుల్ని అలరించింది. రీసెంట్ గా సతీ లీలావతి మూవీని మొదలుపెట్టిన లావణ్య ఆ సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ పాత్రలు చేయని లావణ్య, ఇప్పుడు పెళ్లయ్యాక కూడా అలాంటి పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. మలయాళ హీరో దేవ్ మోహన్ ఈ సినిమాలో లావణ్యకు జోడీగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా లావణ్య తన ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేసింది.
ఆ ఫోటోలో లావణ్య తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి మెరిసింది. లావణ్య గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరవగా, వరుణ్ వైట్ ప్యాంట్, బ్లూ షర్ట్ లో కనిపించాడు. ఈ ఫోటోలో లావణ్య వరుణ్ కౌగిలిలో ఒదిగిపోగా, ఫోటోలను చూసి మెగా ఫ్యాన్స్ మీ కపుల్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తూ లైక్స్ చేస్తున్నారు. లావణ్య షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.