వరుణ్ తేజ్ మరో కామెడీ ప్రయోగం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిగా 2019లో ‘గద్దలకొండ గణేష్’ తో సక్సెస్ అందుకున్నాడు.

Update: 2024-09-29 10:16 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిగా 2019లో ‘గద్దలకొండ గణేష్’ తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత ‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూడు చిత్రాలు భిన్నమైన కాన్సెప్ట్ లతో వచ్చినప్పటికీ ఒకదానిని మించి మరొకటి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారాయి. అయితే ఈ సారి ఎలా అయిన సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న వరుణ్ తేజ్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే పీరియాడికల్ జోనర్ మూవీ చేస్తున్నాడు.

కరుణ కుమార్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మట్కా’ టైటిల్ తో సిద్ధమవుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ పైన వరుణ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా మూడు వేరియేషన్స్ తో ఉండబోతోందని తెలుస్తోంది. దీని తర్వాత ఈ మెగా హీరో మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు.

అందులో క్రైమ్ కామెడీ కథతో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో దర్శకుడిగా పరిచయం అయిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకి ‘కనకరాజు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. సౌత్ కొరియాలో ఈ మూవీ మేజర్ పోర్షన్ ఉంటుందంట. ప్రస్తుతం విసా ప్రాసెస్ లు అవుతున్నాయని తెలుస్తోంది.

నవంబర్ లో ‘కనకరాజు’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. దీని తర్వాత ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ మూవీ చేయనున్నాడు. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ అమెరికాలో ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం వరుణ్ తేజ్ లైన్ అప్ చూసుకుంటే సీరియస్ మోడ్ లో నడిచే యాక్షన్ ప్యాక్డ్ చిత్రంతో పాటు క్రైమ్ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ ఉన్నాయని అర్ధమవుతోంది. వీటిలో మొదటి, రెండు జోనర్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. మరి మూడు వేర్వేరు జోనర్స్ లలో తెరకెక్కనున్న ఈ సినిమాలతో వరుణ్ తేజ్ ఏ మేరకు గాడిలో పడతాడనేది చూడాలి.

Tags:    

Similar News