వరుణ్-లావణ్య హనీమూన్ అంత మంచులోనా
నూతన వధూవరులు ఇటలీ నుండి తిరిగి వచ్చాక, తెలుగు చిత్ర పరిశ్రమ సహా తమ కుటుంబ సభ్యుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించారు.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట పెళ్లయిన నెలరోజులకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పారు. ఈ జంట విదేశీ వెకేషన్ కి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ ఈ వెకేషన్ దేనికోసమో అభిమానులు గెస్ చేయగలరా? అంటే.. నిస్సందేహంగా ఈ జంట హనీమూన్ కోసమేనని చెప్పేస్తారు. ఇప్పుడు హనీమూన్ నుంచి స్నీక్-పీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరిద్దరు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులు ఇటలీ నుండి తిరిగి వచ్చాక, తెలుగు చిత్ర పరిశ్రమ సహా తమ కుటుంబ సభ్యుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించారు.
ఇప్పుడు ఈ జంట లండన్ వెకేషన్ నుండి కొన్ని అరుదైన ఫోటోలను షేర్ చేసారు. గ్రాండ్ వెడ్డింగ్ పూర్తయిన, ఒక నెల తర్వాత ఇద్దరూ హనీమూన్‌కు వెళ్లారు. డిసెంబర్ 5న లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో లండన్ హాలిడే నుండి ఫోటో, వీడియోను షేర్ చేసారు. లండన్ వింటర్ వండర్ల్యాండ్ నుండి ఒక వీడియోను షేర్ చేయగా అది వైరల్ అయింది. మంచు శిల్పాల నడుమ ఈ జంట కనిపించగా అభిమానులు అంత చలిలో హనీమూన్ సాహసమా? అంటూ ఆట పట్టించారు. లావణ్య పోస్ట్ చేసిన మరో ఫోటోలో వరుణ్ తేజ్ ఐస్ క్రీం పట్టుకుని కనిపిస్తున్నాడు.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం నవంబర్ 1న ఇటలీలో జరిగింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నవంబర్ 18న ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసిన లావణ్య సోషల్ మీడియాలో ఇలా రాసింది, ``నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, దయగల, శ్రద్ధగల వ్యక్తి ఇప్పుడు నా భర్త! నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. కానీ దానిని మన మధ్య ఉంచుకుందాం. ఈ పెళ్లితో మా కుటుంబాలు ప్రియమైన వారితో కలిసి ఉండాలని మేము కలలుగన్న ప్రతిదీ సాధ్యమైంది. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞురాలిని`` అని రాసింది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2016 నుండి స్థిరమైన సంబంధంలో ఉన్నారు. ఇద్దరూ రెండు తెలుగు చిత్రాలలో నటించారు - మిస్టర్-అంతరిక్షం 9000 KMPH చిత్రాల్లో జంటగా నటించారు.