వరుణ్ తేజ్ అత్తారింట్లో రిసెప్షన్!
తాజాగా లావణ్య-వరుణ్ జోడీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైంది. భార్యని తీసుకుని తొలిసారి వరుణ్ అత్తవారింటికి బయల్దేరినట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్-లావణ్య వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరగడం..అటుపై హైదరాబాద్ లో అంతే వైభవంగా రిసెప్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక వివాహం తర్వాత కొణిదెల ఇంట కోడలిగా లావణ్య గుమ్మంలోకి అడుగు పెట్టేసింది. అప్పుడే నాగబాబు కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మొదలు పెట్టింది. పెద్దలంటే ఎంత గౌరవం అన్నది కొన్ని సంకేతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఆరకంగా లావణ్య మెగా ఇంట కోడలైపోయింది.
మరి వరుణ్ తేజ్ అత్తారింట్లో కాలు పెట్టేది ఎప్పుడు? అంటే ప్రస్తుతం ఆపనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా లావణ్య-వరుణ్ జోడీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైంది. భార్యని తీసుకుని తొలిసారి వరుణ్ అత్తవారింటికి బయల్దేరినట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్ల సంప్రదాయం ప్రకారం వరుణ్ కొన్ని కట్టుబాట్లు అనుసరించాల్సి ఉంటుంది. లావణ్య త్రిపాఠిది అయోధ్య దగ్గర ఒక ఊరు.
ప్రస్తుతం ఫ్యామిలీ డెహ్రాడూన్ లో ఉంటుంది. కొత్త దంపతులు నేరుగా డెహ్రాడూన్ కి వెళ్తారు. అక్కడ లావణ్య తల్లిదండ్రులు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పెళ్లి సంబురాలు మొదలైన దగ్గర నుంచి కొణిదెల కుటుంబమే హైలైట్ అయ్యింది. ఎక్కడా లావణ్య తరుపు తల్లిండ్రు లుగానీ..బంధువర్గం గానీ పెద్దగా కనిపించలేదు. వాళ్లెవ్వరు సెలబ్రిటీ కాకపోవడంతో? ఎవరు ఏంటి అన్నది ఎవరికీ తెలియకపోవడమే అందుకు కారణం.
డెహ్రాడూన్ లో రిసెప్షన్ బంధువులు ...స్నేహితు లు..హితులు..సన్నిహితుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రేషన్ కూడా గ్రాండ్ గా జరగనుంది. ఎలాగూ ఇద్దరూ సెలబ్రిటీలు కాబట్టి ఆ ఫోటోలు నెట్టింట లీక్ అవుతాయి.