వదినమ్మ ఒచ్చేసింది: నిహారిక కొణిదెల‌

నిహారిక తాజాగా సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోకి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. "వదినమ్మ ఒచ్చేసింది".. "కోడలు వచ్చింది" అని రాసింది.

Update: 2023-11-02 16:01 GMT

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహంతో ఒక‌ట‌య్యారు. ఇట‌లీ టుస్కానీలో జ‌రిగిన ఈ వేడుక‌కు మెగా- అల్లు కుటుంబీకులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక‌లో మెగా హీరోలంతా సంద‌డి చేసారు. ఇక ఇదే పెళ్లిలో వ‌రుడు వ‌రుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల సంద‌డికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. తాజాగా నిహారిక కొణిదెల‌ నూతన వధూవరులతో అంద‌మైన‌ క్షణాల‌కు సంబంధించిన ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. ఇది స్వచ్ఛమైన ఆనందం.. నిహారిక ఆ క్ష‌ణం మైమ‌రిచి చిన్న పిల్ల‌లా న‌వ్వుల్లో మునిగిపోయింది. నిహారిక తాజాగా సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోకి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. "వదినమ్మ ఒచ్చేసింది".. "కోడలు వచ్చింది" అని రాసింది.


ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్ స‌హా పలువురు సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన చిరస్మరణీయ క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి.

అన్నా వ‌దిన‌లతో సంబ‌రం:

పెళ్లి నవంబర్ 1న జరిగినప్పటికీ, వేడుకలు చాలా ముందుగానే అంటే అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. ఈ పార్టీ ఇతర వేడుకల సమయంలో అతిథులు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడింది. 31న హల్దీ - మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. పెళ్లి రోజు వేడుకలు బరాత్ ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. స్పాట్ లో వరుడు పాతకాలపు కన్వర్టిబుల్ వింటేజ్ కారులో కనిపించాడు. వరుణ్ తేజ్ పాపుల‌ర్ డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా ఆఫ్-వైట్ షేర్వానీలో, భారీ బంగారు ఎంబ్రాయిడరీతో కనిపించాడు. లావణ్య విషయానికొస్తే, ఆమె రూబీ-ఎరుపు కాంచీపురం చీరలో చక్కదనంతో కనిపించింది. ఆమె మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్ - కస్టమ్ టిష్యూ సిల్క్ వీల్‌ను కూడా ధరించింది. భారీ నెక్లెస్‌లు, గాజులు ధ‌రించి వ‌ధువు అందంగా క‌నిపించింది.

నవంబర్ 5న గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుందని, దీనికోసం టాలీవుడ్ కి చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. వరుడు స్వరోవ్ స్కీ అలంకరించిన మనీష్ మల్హోత్రా టక్సేడోలో కనిపిస్తాడని, వధువు ఎలక్ట్రిక్ బ్లూ గౌనులో కనిపిస్తుందని కూడా తెలిసింది. అన్నా వ‌దిన‌ల‌తో నిహారిక ఎంతో సంబ‌రంగా క‌నిపించింది. ఈ ఆనందం ఫోటోల్లో ప్ర‌స్ఫుట‌మైంది. ఇంత‌లోనే ఇవి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News