మెగా వారసుడి చిత్రానికి ముహూర్తం!
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా ప్రారంభానికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం.
By: Tupaki Desk | 28 Dec 2024 7:30 AM GMTమెగా వారసుడు వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్సైందా అంటే అవుననే తెలుస్తోంది. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న దానిపై ఇంతవరకూ సరైన క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా ప్రారంభానికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం. అనంతరం మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. దీనిలో భాగంగా వరుణ్ తేజ రాయలసీమ మాండలికం నేర్చుకుంటున్నాడట. అలాగే సినిమాలో న్యూ లుక్ లోనూ కనిపించబోతున్నాడుట. లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా వరుణ్ తేజ్ సీమ బిడ్డ అవతారంలోకి మారుతున్నాడని తెలుస్తోంది. రాయలసీమ మనుషులు, మనసుల్లో కలిసిపోయే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా సక్సెస్ కూడా వరుణ్ తేజ్ కి అంతే కీలకం. ఈ మధ్య కాలంలో వరుణ తేజ్ కి వరుసగా హ్యాట్రిక్ ప్లాప్ లు పడ్డాయి. ఆయన హీరోగా నటించిన `గాండీవదారి అర్జున`, `ఆపరేషన్ వాలెంటైన్`, `మట్కా` చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. వరుస పరాభావాలతో వరుణ్ మార్కెట్ పై ప్రభావం చూపుతుందనే విమర్శలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో తదుపరి సినిమా తో సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మేర్లపాక గాంధీకి కూడా సరైన సక్సెస్ లేదు. `ఎక్స్ ప్రెస్ రాజా` తర్వాత చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో రెండేళ్లగా ఖాళీగానే ఉంటున్నాడు. `లైక్ షేర్ సబ్ స్క్రైబ్` తర్వాత గాంధీ సినిమాలు చేయలేదు. వరుణ్ స్టోరీ పైనే కూర్చున్నాడు. కానీ వరుణ్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సాధ్యపడలేదు. ఎట్టకేలకు 2025 ఆరంభంలో మొదలవుతున్నారు.