తీవ్ర నిరుత్సాహంలో స్టార్ వారసుడు!
లేదంటే అది మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దీంతో తదుపరి ప్రాజెక్ట్ విషయలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
మెగా వారసుడు వరుణ్ తేజ్ కి 'ఫిదా'..'తొలి ప్రేమ' తర్వాత సోలో సక్సెస్ దక్కని సంగతి తెలిసిందే. మధ్యలో 'గద్దలకొండ గణేష్' యావరేజ్ గా ఆడినా 'అంతరిక్షం'..'గని'..'గాండీవధారి అర్జున' చిత్రాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. 'ఎఫ్-2'..'ఎఫ్-3' లాంటి సినిమాలు భారీ విజయం సాధించి నా ఆ క్రెడిట్ వరుణ్ కి ఒక్కడికే సొంత కాదు. వెంకటేష్ తో పాటు అనీల్ రావిపూడి లాంటి ప్రతిభావం తులు తోడవ్వడంతోనే ఆ రేంజ్ సక్సెస్ సాధ్యమైంది.
ఇక ఇటీవల రిలీజ్ అయిన మరో సోలో అటెంప్ట్ 'ఆపరేష్ వాలెంటైన్' ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వరుణ్ కెరీర్ లోనే మరో గొప్ప ప్రయోగాత్మక చిత్రంగానూ...దేశ భక్తి చిత్రంగానూ నిలిచిపోతుందని భావించారంతా. కానీ రిలీజ్ తర్వాత సన్నివేశం అందుకు భిన్నంగా కనిపించింది. వరుణ్ కెరీర్ లో మరో అతి పెద్ద డిజాస్టర్ గా టాక్ తెచ్చుకుంది.
మరి ఈ వైఫల్యాల ప్రభావం వరుణ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గతం కంటే భిన్నంగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుణ్ ఇప్పుడీ ఫేజ్ నుంచి వీలైనంత త్వరగా బయట పడాల్సిందే. లేదంటే అది మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దీంతో తదుపరి ప్రాజెక్ట్ విషయలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 'పలాస' దర్శకుడు కరుణ్ కుమార్ తో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 'మట్కా' అనే యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. 1960 కాలం నాటి స్టోరీ ఇది. ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమనే చెప్పాలి. వరుణ్ కెరర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరుణ కమార్ కి దర్శకుడిగా ఇది రెండవ సినిమా మాత్రమే. 'పలాస' తర్వాత అతన్ని అల్లు అరవింద్ తన కాంపౌండ్ లో సానబెట్టారు. ఆహా కోసం వెబ్ సిరీస్ లు చేయించ డంతో కొంత రాటు దేలాడు. అదే అనుభవంతో వరుణ్ తేజ్ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వరుణ్ ఆశలు.. అంచనాలు అన్నీ 'మట్కా'పైనే. ఈ సినిమా ఫలితమే మెగా వారసుడ్ని అన్ని రకాలగా బయటకు తీసుకురావాలి.