రెండు ఫ్యామిలీల హీరోలను బ్యాలెన్స్ చేస్తున్న డైరెక్టర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు.;

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. బింబిసార సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత దానికి సీక్వెల్ గా బింబిసార2 ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ సినిమా ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు.
ఒకవేళ బింబిసార2 ఉన్నా దానికి డైరెక్టర్ వశిష్ట కాదని కొంతమంది అంటుంటే కళ్యాణ్ రామ్ కు, వశిష్ట కు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా బింబిసార2 సినిమా నుంచి వశిష్ట తప్పుకున్నాడంటున్నారు ఇంకొందరు. దీంతో రెండో సినిమాగా వశిష్ట ఎవరితో సినిమా చేస్తాడా అని అనుకుంటున్న టైమ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని లైన్ లో పెట్టాడు.
ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ ను ఓ కొలిక్కి తెచ్చే పనిలో బిజీగా ఉన్న వశిష్ట ఈ సినిమా తర్వాత చేయడానికి ఇప్పటికే కొంత మంది హీరోలకు కథలు చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తోంది. వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వశిష్ట తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
వశిష్ట ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు ఒక కథ చెప్పాడని, ఆయన కూడా కథ విని ఓకే అన్నారని, ప్రస్తుతం ఆయన అఖండ2 సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్సుందని ఆయన అన్నారు. బాలయ్యతో పాటూ రామ్ చరణ్ కు కూడా వశిష్ట ఓ కథ చెప్పినట్టు మల్లిడి సత్యన్నారాయణ తెలిపారు.
బింబిసార సినిమా చూశాక అల్లు అర్జున్ పిలిచి కథ చెప్పమన్నాడట కానీ తానే ఇప్పుడు వద్దని చెప్పానని, బింబిసార చూశాక మీ అబ్బాయి సినిమా బాగా చేశాడు. ఫ్యూచర్ లో సినిమా చేద్దాం, కథ రెడీ చేసుకోమని చెప్పాడని ఆయన వెల్లడించారు. వశిష్ట తండ్రి మాటల్ని బట్టి చూస్తుంటే విశ్వంభర తర్వాత వశిష్ట బాలయ్యతో సినిమా చేసే అవకాశముంది. ఇటు మెగా ఫ్యామిలీని, అటు నందమూరి ఫ్యామిలీలను వశిష్ట భలే బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే వశిష్ట నెక్ట్స్ మూవీస్ లైనప్ క్రేజీగా ఉండనుందని అర్థమవుతుంది.