మళ్లీ మెగా హీరోతోనే వశిష్ట!
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీ కరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. సమ్మర్ లో రిలీజ్ అవుతుందా? వేసవి తర్వాత అన్న దానిపై సస్పెన్స్ కొన సాగుతుంది. ప్రస్తుతం వశిష్ట ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు.
మరి ఈ చిత్రం తర్వాత వశిష్ట ఏ హీరోని డైరెక్ట్ చేయనున్నాడు? అంటే ఇంత వరకూ క్లారిటీ లేదు. తొలి సినిమా `బింబిసార`తో కల్యాణ్ రామ్ కి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ సక్సెస్ చూసే చిరంజీవి పిలిచి రెండవ సినిమా అవకాశం కల్పించారు. మరి మూడవ సినిమా సంగతేంటి? అంటే చిరు అదే కాంపౌండ్ లో వశిష్టను లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయాల్సిందిగా చిరంజీవి అడిగారుట.
ఆయన అడిగే సరికి వశిష్ట కూడా కాదనకుండా ఎస్ చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. వైష్ణవ్ తేజ్ కూడా కొంత కాలంగా వైఫల్యాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత సరైన బ్రేక్ రాలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆది కేశవ చిత్రాలు కమర్శియల్ గా రాణించలేదు. దీంతో వైష్ణవ్ నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. సరైన కథ, దర్శకుడు కుదరకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.
స్టోరీలు వింటున్నా? నచ్చిన కథలు సెట్ అవ్వడం లేదు. దీంతో వశిష్ట ట్యాలెంట్ చూసిన చిరంజీవి మేనల్లుడితో కూడా సినిమా చేసే దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. అయితే వైష్ణవ్ కోసం ఇప్పటి కిప్పుడు తన వద్ద స్టోరీ లేదని..అందుకు సమయం కావాలని అడిగాడుట. చిరంజీవి కూడా అందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా విషయం తెలియాల్సి ఉంది.