వీరమల్లుకి పవన్ నాలుగు రోజులు ఇవ్వలేకపోతున్నారా?
దీంతో రిలీజ్ తేదీకి మేకర్స్ అంతగా ప్రాధాన్యత ఇచ్చిన ట్లులేదు..మళ్లీ వాయిదా వేసే ఆలోచనతోనే ఇలా సూచన ప్రాయంగా హింట్ ఇచ్చారనే సందేహాలున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ తేదీకి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన బాబి డియోల్ న్యూలుక్ లో రిలీజ్ తేదీని ఓ కార్నర్ లో వేసారు. దీంతో రిలీజ్ తేదీకి మేకర్స్ అంతగా ప్రాధాన్యత ఇచ్చిన ట్లులేదు..మళ్లీ వాయిదా వేసే ఆలోచనతోనే ఇలా సూచన ప్రాయంగా హింట్ ఇచ్చారనే సందేహాలున్నాయి.
తాజా సన్నివేశం చూస్తుంటే రిలీజ్ వాయిదా దాదాపు ఖరారయ్యేలా ఉందనే సందేహాలు మరింత బలప డుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఇంకా నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందిట. కానీ ఆయన ఇంతవరకూ ఆ నాలుగు రోజుల డేట్లు ఇవ్వనట్లు తెలుస్తోంది. ఎప్పుడు కేటాయిస్తారో? కూడా తెలియని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే జనవరి పూర్తయింది. ఫిబ్రవరికి ఎంటర్ అయిన పరిస్థితి.
ఆ నాలుగు రోజుల డేట్లు కేటాయిస్తాడని నెల రోజులుగా ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకూ ఆ సన్నివేశం చోటు చేసుకోలేదు. ఆ నాలుగు రోజుల షూటింగ్ లో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. ఆ సన్నివే శాలకు సంబంధించి విజువల్ ఎఫెక్స్ట్ కూడా రిచ్ గా చేయాల్సి ఉందిట. ఆ పనుల కోసమే 15-20 రోజులు సమయం పడుతుందంటున్నారు. ఇంకా పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
ఇలాంటి తరుణంలో పవన్ డేట్లు ఇవ్వకపోవడం...పెండింగ్ పనులు.. ఇవన్నీ ఒకేసారి పూర్తి చేసి మార్చి 28న రిలీజ్ చేయడం అన్నది అసాద్యంగానే కనిపిస్తుందని మేకర్స్ గందరగోళానికి గురవుతున్నట్లు సమాచారం. మరి ఈ టెన్షన్ నుంచి పవన్ వాళ్లను ఎప్పుడు బయటకు తెస్తారో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొంటు న్నట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ కి కూడా పవన్ సరిగ్గా హాజరు కాలేకపోతున్నాడని వినిపిస్తోంది.