వెంకటేష్ తో రానా.. కరెక్ట్ టైంకి దించుతున్నారుగా..!

పొంగల్ రేసులో బాలయ్య, చరణ్ సినిమాలతో పాటు వెంకటేష్ కూడా వస్తున్నాడు.

Update: 2025-01-08 10:34 GMT

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం తో వస్తున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చింది. పొంగల్ రేసులో బాలయ్య, చరణ్ సినిమాలతో పాటు వెంకటేష్ కూడా వస్తున్నాడు.

ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. అనీల్ రావిపూడి సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో ఏ మాధ్యమాన్ని వదలట్లేదు. ఇక ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి షోకి కూడా వెంకటేష్ అండ్ టీం సందడి చేశారు. అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న రానా దగ్గుబాటి షోకి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ రాగా వారితో రానా చిట్ చాట్ క్రేజీగా నడిచింది. ఇక ఇప్పుడు బాబాయ్ వెంకటేష్ తో రానా దగ్గుబాటి స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

ఇంట్లోనే స్టార్ ని పెట్టుకుని అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన రానా కూడా బాబాయ్ వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్స్ ఐశ్వర్య, మీనాక్షిలు కూడా ఈ చిట్ చాట్ లో పాల్గొన్నారు. సంక్రాంతికే ఈ ఎపిసోడ్ కూడా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి శనివారం ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో రానా సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

ఈ శనివారం విక్టరీ వెంకటేష్ తో రానా ఇంటర్వ్యూ రాబోతుంది. దీనికి సంబందించిన ప్రోమో రిలీజైంది. వెంకీ, రానా చాలా ఫన్నీగా చిట్ చాట్ చేశారు. అంతేకాదు ఈ చిట్ చాట్లో పాల్గొన్న ఐశ్వర్యా రాజేష్, మీనాక్షిలతో కూడా రకరకాల ఫన్ మూమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది. రానా దగ్గుబాటి వెంకటేష్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోనే ఆకట్టుకోగా కచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ అదిరిపోతుందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అటు స్మాల్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ దేన్నీ వదలకుండా చేస్తున్నారు. వెంకటేష్ కూడా సినిమా చేశామా పని అయిపోయిందా అన్నట్టు కాకుండా సినిమా రిలీజ్ వరకు భారీగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై బజ్ పెంచుతున్నారు. రానాతో వెంకటేష్ ఇంటర్వ్యూ దగ్గుబాటి ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News