నేను ఫుల్ వైట్ మనీ తీసుకుంటా: హీరో వెంకటేష్

ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జరుగుతోన్న ఐటీ దాడులపై అనిల్‌ స్పందించారు.

Update: 2025-01-23 09:46 GMT

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నిర్మాత దిల్ రాజుపై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నివాసాలు, ఆఫీసులపై గత మూడు రోజులుగా ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి టైంలో తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌ మీట్‌ ను నిర్వహించారు. హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మీడియా ఇంట్రాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జరుగుతోన్న ఐటీ దాడులపై అనిల్‌ స్పందించారు.

ప్రొడ్యూసర్ ఐటీ రైడ్స్‌ బాధలో ఉంటే మీరు సక్సెస్‌ సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? అని ఓ జర్నలిస్ట్‌ సరదాగా ప్రశ్నించగా.. ''సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్‌ పెట్టాం కదా.. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారనుకుంటా. దిల్‌ రాజు బాధలో ఏమీ లేరు. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు. ఇదొక ప్రాసెస్‌లో భాగమే. ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ, బిజినెస్‌ సర్కిల్స్ లో ఐటీ రైడ్స్ జరగడం సర్వసాధారణం. ఇంకా మేం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. డ్రైవర్స్ ను వాళ్ళనీ వీళ్ళనీ పట్టుకొని సక్సెస్ మీట్ చేస్తున్నామని చెబితే.. ‘మేము వచ్చినా రాకపోయినా.. మీరు ఈ సినిమా ప్రమోషన్స్, ఇంట్రాక్షన్స్ ఏమీ ఆపొద్దు. ఈ సినిమా విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి’ అని దిల్‌ రాజు మాతో చెప్పారు. అందుకే హ్యాపీగా ఈ సినిమా కోసం మీ ముందుకు వచ్చాం'' అని అనిల్ రావిపూడి చెప్పారు.

'సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.. మీ ఇంటికి కూడా వస్తారా?' అని అడిగిన ప్రశ్నించగా.. ''నేను ఇంకా సుకుమార్‌ ఇంటి పక్కకి షిఫ్ట్ అవ్వలేదు. ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు షిఫ్ట్‌ అవుతాను. నేను ఆయన ఇంటి పక్కన లేను కాబట్టి రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి.. కచ్చితంగా వాళ్ళు మా ఇంటికి వచ్చే అవకాశం ఉంది'' అని అనిల్ నవ్వుతూ బదులిచ్చారు. ఇకపోతే సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ కారణంగానే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 9 రోజుల్లో 230 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ నంబర్స్ అన్నీ ఖచ్చితమైనవని అనిల్ రావిపూడి అన్నారు.

''మావన్నీ ఆక్యురేట్ నెంబర్స్.. జీఎస్టీతో కలిపి మరీ వేసాం. పర్ఫెక్ట్ నంబరే ఇచ్చాం. మా సినిమా వరకు చెప్పమంటే, ప్రతీ రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచే వచ్చింది. ఈ జోనర్ కి ఇంత స్ట్రెంత్ ఉంది అని చెప్పడానికే ఈ పోస్టర్స్ వేస్తున్నాం. సినిమా జనాలు చూసి సక్సెస్ అయిన తర్వాత, అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా లేదు. కానీ ఫ్యామిలీ జోనర్, ఎంటర్టైన్మెంట్ సినిమాలకు గ్రేట్ ఫుల్ ఉందని ఇంకో ఐదారు సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారని.. కలెక్షన్స్ వివరాలు చెబుతున్నాం'' అని రావిపూడి అనిల్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే హీరోలు తమ రెమ్యునరేషన్ మొత్తాన్ని వైట్ మనీగా తీసుకుంటే, ఏ నిర్మాతా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదని, హీరోల కోసం బ్లాక్ చేయాల్సి వస్తోందనే వాదన ఇండస్ట్రీలో ఉంది. ఇదే విషయం మీద హీరో వెంకటేష్ స్పందించారు. ''మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఫుల్ వైట్. వైట్ లో వైట్. తీసుకునే రెమ్యునరేషన్ కొంచమే. ఇంపాక్ట్ నేను ఎక్కువ తీసుకోను. తీసుకునేది వైట్ లోనే తీసుకుంటా. అది కూడా ఆఫీస్ లో తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడో అవసరానికి ఏదో తీసుకుంటాను'' అని వెంకీ అన్నారు.

Tags:    

Similar News