దృశ్యం-3.. తెలుగు సంగతేంటి?

మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్.. రీసెంట్ గా సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. దృశ్యం 3ను అధికారికంగా అనౌన్స్ చేశారు.

Update: 2025-02-23 07:13 GMT

మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్.. రీసెంట్ గా సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. దృశ్యం 3ను అధికారికంగా అనౌన్స్ చేశారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం.. 2013లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో రీమేక్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఆ తర్వాత దృశ్యం-2.. కూడా వచ్చింది. కరోనా వల్ల ఓటీటీలో రిలీజ్ అయిన ఆ మూవీకి వేరే లెవెల్ హిట్ అయింది. ముఖ్యంగా మోహన్ లాల్ యాక్టింగ్, జీతూ మేకింగ్ కు అంతా ఫిదా అయ్యారు. తెలుగులో కూడా రెండు సిరీస్ చిత్రాలు.. మంచి హిట్స్ అయ్యాయి. అదే సమయంలో మూడో భాగం ఉంటుందని కూడా జీతూ అనౌన్స్ చేశారు.

ఆ మధ్య మూవీ స్టార్ట్ అవ్వడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని తెలిపారు. రీసెంట్ గా దృశ్యం 3 స్క్రిప్ట్ రెడీ అయిందని తెలుస్తోంది. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం 3 రాబోతోందని ట్వీట్ చేశారు. మరికొద్ది నెలల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని తెలుస్తోంది. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్ వెర్షన్స్ సంగతేంటేనది చర్చ జరుగుతోంది. బాలీవుడ్ వెర్షన్ ను మళ్లీ అజయ్ దేవగన్ చేయనున్నారు. 2025లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం దే దే ప్యార్ దే 2తో బిజీగా ఉన్నారు. ధమాల్, రేంజర్ చిత్రాలు చేయనున్నారు. ఆ తర్వాత అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో దృశ్యం-3ను కంప్లీట్ చేయనున్నారు.

అయితే 2025 అంతా అజయ్ దేవగన్ బిజీబిజీగా గడుపుతున్నట్లే. మధ్యలో రైడ్-2, సన్ ఆఫ్ సర్దార్-2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గోల్ మాల్ 5 కూడా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఆయనే యాక్ట్ చేస్తారా లేదా అన్న విషయంపై ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.

దీంతో వెంకటేష్ గమనిస్తున్నారా అని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను చేస్తామని ప్రకటించారు. అనిల్ రావిపూడితో మరిన్ని చిత్రాలు చేస్తామని తెలిపారు. మరి ఇప్పుడు దృశ్యం -3 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. అయితే ఆయన కెరీర్ లో దృశ్యం రెండు భాగాలు మంచి హిట్స్ సాధించాయి కాబట్టి.. మూడో భాగం ఆయనే చేసే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News