బట్టలు, బంగారం దుకాణాలు మేము ఓపెన్ చేస్తాం!
బట్టలు..బంగారు ఆభరణాల దుకాణాల ఓ పెనింగ్స్ అన్నీ దాదాపు హీరోయిన్ల చేతుల మీదుగానే జరుగుతాయి.
బట్టలు..బంగారు ఆభరణాల దుకాణాల ఓ పెనింగ్స్ అన్నీ దాదాపు హీరోయిన్ల చేతుల మీదుగానే జరుగుతాయి. హీరోయిన్ ఇమేజ్ ని బట్టి దుకాణాలు పారితోషికం చెల్లించి వాళ్లతో రిబ్బన్ కంటింగ్ చేయిస్తుంటాయి. దుస్తులు.. .బంగారు ఆభరణాల గురించి ఇంకా లోతుగా చెప్పాలంటే? ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా హీరోయిన్లు చేతుల మీదుగా లాంచ్ చేయడం అన్నది చాలా కాలంగా యాజమాన్యాలకు అనవాయితీగా వస్తుంది.
దాదాపు అన్ని భాషల్లోనూ ఇలాగే ఉంటుంది. బంగారు ఆభరణాలంటే మహిళలకు మక్కువ కాబట్టి సెంటిమెంట్ గా వాళ్లతో లాంచ్ చేయిస్తారు. బట్టలు అయినా సరే మహిళల ఉండే ఆసక్తి వేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వాళ్లతో లాంచ్ చేయిస్తుంటారు. ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ప్రత్యక విభాగాలు కొత్తగా ఏర్పాటైనా హీరోయిన్లతోనే రిబ్బన్ కట్ చేయిస్తారు. అయితే అలాంటి పనులు అందమైన హీరోయిన్లే కాదు హీరోలు మేము కూడా చేస్తామంటూ విక్టరీ వెంకటేష్ ముందుకొచ్చారు.
ఐశ్వర్యా రాజేష్, మినాక్షి చౌదరి మాత్రమే కాదు దుకాణాలు మేము కూడా ఓపెన్ చేస్తాం. అలాంటి అవకాశాలు ఏవైనా ఉంటే? మాకు కూడా చెప్పండి అంటూ నవ్వేసారు. ఇటీవల రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐశ్వర్య, మీనాక్షిలకు మంచి పేరొచ్చింది. తెలుగింట నటీమణుల్లా ఫేమస్ అయిపోయారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇద్దరుబాగా రీచ్ అయ్యారు. దీంతో బట్టలు..బంగారు ఆభరణాలు షోరూలు ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరే ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి వెంకటేష్ కి తెలియడం తోనే అలా సరదాగా మాట్లాడారు. మిగతా రాష్ట్రాలన్నింటి కంటే తెలుగు రాష్ట్రాల్లో బట్టలు..బంగారం దుకాణాలు ఎక్కువ అవ్వడంతో? హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది.