యంగ్ హీరోతో వెంకీ న్యూ కాంబో

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని వెంకటేష్ చూస్తున్నారు.

Update: 2024-10-20 00:30 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్.. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లు కావడంతో.. వెంకీ 76 ప్రాజెక్ట్ పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మీనాక్షీ చౌదరీ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని వెంకటేష్ చూస్తున్నారు.


అయితే వెంకటేష్.. నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. సినీ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నా.. ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కోలీవుడ్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ తో ఆయన వర్క్ చేయనున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో సినిమాను సంతోష్ తెరకెక్కించనున్నారని.. వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల వెంకటేష్ కు డైరెక్టర్ సంతోష్ స్టోరీని నెరేట్ చేశారని సమాచారం. కానీ వెంకీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఆయన ఓకే చెప్పిన తర్వాత.. సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ చెప్పిన స్టోరీ.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు బాగా నచ్చిందట. దీంతో ఆయన నిర్మించేందుకు సిద్ధమైనట్లు వినికిడి.

తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై నితిన్ రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మిస్తూనే.. చిన్న రోల్ లో యాక్ట్ కూడా చేయనున్నారని తెలుస్తోంది. లాయర్ గా నితిన్ కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదించినట్లు వినికిడి. కోలీవుడ్ నటుడు నరైన్ కీలక పాత్ర పోషించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆయనకు డైరెక్టర్ సంతోష్ లుక్ టెస్ట్ చేశారట.

నిజ జీవితంలోని పలు ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వెంకటేష్ ఓకే చెప్పాక.. ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి తమిళ డైరెక్టర్ సంతోష్ చెప్పిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీకి వెంకటేష్ ఓకే చెబుతారా లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News