ఆ రెండిటి వల్ల వెంకీకి ప్లస్సే.. ఎందుకంటే..?

ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Update: 2025-01-01 03:51 GMT

సంక్రాంతి సినిమాల పండుగలో భాగంగా 2025 సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఇద్దరు సీనియర్ స్టార్స్ తో గ్లోబల్ స్టార్ పోటీ పడుతున్నాడు. సీనియర్ స్టార్స్ అయిన బాలకృష్ణ డాకు మహారాజ్ తో వస్తుండగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ తోనే వస్తున్నాడు. ఈ ఇద్దరికి పోటీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గా దిగుతున్నాడు. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఐతే గేమ్ ఛేంజర్ ఒక మంచి కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. థమన్ మ్యూజిక్, కియరా గ్లామర్ కూడా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే పవర్ బాబీకి పవర్ ఫుల్ మాస్ హీరో దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపిస్తున్నారు. డాకు మహారాజ్ తప్పకుండా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది.

ఈ సినిమాలతో పాటు వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం దిగుతుంది. ఐతే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ల కన్నా వెంకీ సినిమాకే ఎక్కువ సక్సెస్ పర్సెంటేజ్ ఉందని చెప్పొచ్చు. అలా ఎందుకు అంటే గేం ఛేంజర్ ఒక ఐ.ఏ.ఎస్, పొలిటికల్ మధ్య సాగే యాక్షన్ డ్రామా.. ఇది వర్క్ అవుట్ అయితే అద్భుతాలు చేస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా రిస్క్ లో పడినట్టే. డాకు మహారాజ్ కూడా బాలయ్య మార్క్ మాస్ సినిమాగా వస్తుంది. ఐతే సినిమా క్లిక్ అయితే పర్వాలేదు కాకపోతే మాత్రం మిస్ ఫైర్ అయినట్టే.

ఐతే ఆ రెండు సినిమాలకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. వెంకటేష్ సినిమాకు అలాంటిది ఏది లేదు. జస్ట్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా లో అనీల్ మార్క్ ఫన్ ఉంటుంది. వెంకటేష్ మార్క్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈ ఇద్దరి కాంబో ఆల్రెడీ హిట్టు కాబట్టి ఈ సినిమాకు కలిసి వచ్చేస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్న ఆ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి డివైడ్ టాక్ లేదా మిస్ ఫైర్ అయినా కచ్చితంగా వెంకటేష్ సినిమాకే బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి వెంకీ మామ ఈ సంక్రాంతికి ఏం చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News