మామ‌నే పిసికేసిన అల్లుడు నాగ చైత‌న్య‌!

మామ వెంక‌టేష్-అల్లుడు నాగ‌చైత‌న్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్వ‌య‌నా వెంక‌టేష్ కి నాగ‌చైత‌న్య సొంత మేన‌ల్లుడు.

Update: 2025-01-23 13:30 GMT

మామ వెంక‌టేష్-అల్లుడు నాగ‌చైత‌న్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్వ‌య‌నా వెంక‌టేష్ కి నాగ‌చైత‌న్య సొంత మేన‌ల్లుడు. ఇద్ద‌రు క‌లిసి `వెంకీ-మామ` సినిమాలో కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా బాగానే ఆడింది. తాజాగా వెంక‌టేష్ నాగ‌చైతన్య‌తో త‌న‌కున్న బాండింగ్ ని రివీల్ చేసారు. చిన్న‌ప్పుడు చైత‌న్య‌ని హ‌గ్ చేసుకుంటూ ప‌ట్టుకుని గ‌ట్టిగా పిసికేసేవాడుట‌.

చిన్న పిల‌ల్ల్ని ముద్దు చేయ‌డం..ఎత్తుకోవ‌డం..హ‌త్తుకోవ‌డం స‌హ‌జ‌మే. కానీ చైత‌న్య‌ని హ‌త్తుకుంటే ఆఫీలింగ్ తెలియ‌ని అనుభూతిని అందించేద‌న్నారు వెంకీ. చిన్న‌ప్ప‌టి నుంచి చైత‌న్య త‌న‌కి బాగా అల‌వాటు అని, ఎత్తుకుని తిప్ప‌డం.. లాలించ‌డం..పాలించ‌డం అన్ని ద‌గ్గ‌రుండి చూసిన వాడినన్నారు. వెంకీ మామ అంటే చైత‌న్య‌కి కూడా అంతే ఇష్టం. పెద్ద మామ సురేష్ బాబు అంటే కాస్త భ‌యం కానీ..వెంకీ మామ అంటే అంత భ‌యం కాద‌ని..స‌ర‌దాగా ఉంటార‌న్నారు.

అలా మామ‌లిద్ద‌రితో చైత‌న్య రిలేష‌న్ షిప్ ఉంది. తాత‌య్య రామానాయుడు కూడా చైత‌న్య అంటే? అంతే ప్రేమాభి మానాలు కురిపించేవారు. ఇక అక్కినేని ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే వాళ్లంద‌ర్నీ మించి తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర రావుకి చైత‌న్య అంటే గారం. అదే ప్రేమ‌ని `మ‌నం` సినిమాలో విక్ర‌మ్. కె.కుమార్ చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

అలాగే నాగార్జున‌-అమల త‌ల్లిదండ్రులుగా అంతే ప్రేమిస్తారు. చైత‌న్య మంచి తెలివైన విద్యార్ది. చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువు ల్లో ముండే వ్య‌క్తి. విదేశాల్లో బాగా చ‌దువుకున్నాడు. బిజినెస్ రంగంలోనూ చైత‌న్య‌కు మంచి అనుభ‌వం ఉంది. ఇప్ప‌టికే పుడ్ బిజినెస్ లో రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సొంతంగా క్లౌడ్ కిచెన్ ర‌న్ చేస్తున్నాడు. త్వ‌ర‌లో `తండేల్` సినిమాతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Tags:    

Similar News