పొంగల్ ఫైట్.. వెంకీమామ చాలా స్ట్రాంగ్ గా..!
సంక్రాంతి ఫైట్ కి సినిమాలు సిద్ధమవుతున్నాయి. ముందుగా పొంగల్ కి తన ఆట చూపించేందుకు రాం చరణ్ గేమ్ ఛేంజర్ వస్తున్నాడు.
సంక్రాంతి ఫైట్ కి సినిమాలు సిద్ధమవుతున్నాయి. ముందుగా పొంగల్ కి తన ఆట చూపించేందుకు రాం చరణ్ గేమ్ ఛేంజర్ వస్తున్నాడు. మరోపక్క బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి రేసుకి రెడీ అయ్యాడు. గేమ్ ఛేంజర్ శంకర్ డైరెక్షన్ లో ఆయన మార్క్ కమర్షియల్ సినిమాగా వస్తుంది. చరణ్ ఉన్నాడు కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. కథ నచ్చి స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ అయ్యింది అంటే పొంగల్ కి మెగా ధమాకా భారీగానే ఉండబోతుంది.
ఇక మరోపక్క బాలయ్య డాకు మహారాజ్ మాస్ మూవీగా వస్తుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి బాలయ్య మార్క్ ఊర మాస్ యాటిట్యూడ్ ని చూపిస్తుందని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. పొంగల్ ఫైట్ లో బాలయ్య తన స్టామినా చూపించాలని చూస్తున్నారు. ఐతే సంక్రాంతికి సైలెంట్ గా తన ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు విక్టరీ వెంకటేష్.
అనీల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పొంగల్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఐతే రేసులో రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ ఉండగా వెంకటేష్ సినిమా ఏదో వస్తుంది వెళ్తుంది అనుకుంటే పొరబడినట్టే. వెంకీ సినిమాను మొన్నటిదాకా చాలా తక్కువ అంచనా వేశారు కానీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
మరోపక్క సినిమా తీయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయడంలో ఆరితేరిన అనీల్ రావిపుడి వెంకటేష్ ని ఫుల్లుగా వాడేసుకుంటున్నాడు. థర్డ్ సింగిల్ కోసం నేను పాడతా అంటూ వెంకటేష్ వెంటపడే ఐడియాతో సినిమా గురించి మరింత ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. చూస్తుంటే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలైనా యాక్షన్ సినిమాలు కాబట్టి కాన్సెప్ట్ క్లిక్ అవ్వాలి కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కంప్లీట్ ఎంటర్టైనర్ తో వస్తుంది. అంతేకాదు వెంకటేష్ బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.
ఇలా చేస్తే మాత్రం ఆ రెండు సినిమాల కన్నా వెంకీ సినిమానే చాలా స్ట్రాంగ్ గా మారే ఛాన్స్ ఉంటుంది. గేమ్ ఛేంజర్ నిర్మించిన దిల్ రాజు తన సినిమాకు తనే పోటీ వచ్చేశ్తున్నాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు. ఏ సినిమా విజయ పతాకం ఎగరవేస్తుంది అన్నది చూడాలి.