వెంకీతో బాలయ్య.. ఎందుకంత స్పెషల్ అంటే..?
వెంకీతో బాలయ్య ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. బాలయ్య మాస్ తో పూనకాలు తెప్పిస్తే.. వెంకటేష్ తన ఎమోషన్ తో హృదయాలను పిండేస్తాడు.
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ మొదటి నుంచి బాలయ్య ఉత్సాహభరితంగా కనబడుతున్నారు. సీజన్ 4 లో స్టార్ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. లేటెస్ట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం విక్టరీ వెంకటేష్ రాబోతున్నారు. డిసెంబర్ 22 అంటే ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ ఉండబోతుంది. దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు చేశారు.
వెంకీతో బాలయ్య వెరీ స్పెషల్ ఎపిసోడ్ లోడింగ్ అవుతుంది. ఈ ఇద్దరు కలిసి ఏదో ఒకటి రెండు మాటలు తప్ప పెద్దగా మాట్లాడింది లేదు. ఐతే ఈసారి వీరిద్దరు కలిసి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో సర్ ప్రైజ్ చేయనున్నారు. ఈ టాక్ షోతో బాలయ్య తన ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. ఇక ఈ టాక్ షోలో వెంకటేష్ కూడా వస్తే ఇద్దరు ఎలాంటి సంభాషణ జరుపుతారు అన్నది ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
వెంకీతో బాలయ్య ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. బాలయ్య మాస్ తో పూనకాలు తెప్పిస్తే.. వెంకటేష్ తన ఎమోషన్ తో హృదయాలను పిండేస్తాడు. అసలు ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారు. వీరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అన్నది ఈ ఎపిసోడ్ తో తెలుస్తుంది. టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో బాలయ్య, వెంకటేష్ లు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో చేసే హంగామా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.
బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుండగా సినిమాల పోటీ ఎలా ఉన్నా ఈ ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. డాకు మహారాజ్ మాస్ అంశాలతో వస్తుంటే సంక్రాంతికి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకీ సినిమా వస్తుంది. ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి కూడా మాట్లాడే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
అహా అన్ స్టాపబుల్ షో సీజన్ 4 లో వెంకటేష్ సినిమా 7వ ఎపిసోడ్ గా వస్తుంది. డిసెంబర్ 22న షూట్ చేస్తున్న ఈ సినిమా టెలికాస్ట్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది.