వెంకీ - అనిల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే!

ఎఫ్2, ఎఫ్3 సినిమాలు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.

Update: 2024-08-01 23:30 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో Venky 76 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస సక్సెస్ లతో జోరుమీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం. ఎఫ్2, ఎఫ్3 సినిమాలు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సారి క్రైమ్ కామెడీ కథతో అనిల్ రావిపూడి Venky76 మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ లో అనిల్ రావిపూడి పొలాచ్చిలో ప్లాన్ చేసారంట. ఆగష్టు 9 నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పోలాచ్చిలో జరగబోతోందని తెలుస్తోంది.

లాంగ్ షెడ్యూల్ గా పొలాచ్చిలో షూటింగ్ ఉండబోతోందని సమాచారం. అనిల్ రావిపూడి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వీలైనంత తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా మరో కమర్షియల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్ కి రెడీ అవుతుందంట. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. రానా నాయుడు సీజన్ మంచి సక్సెస్ అందుకుంది. దీంతో రానా నాయుడు సీజన్ 2పైన అంచనాలు పెరిగాయి.

రానా, వెంకటేష్ ఈ సిరీస్ లో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా మీద మాత్రం వెంకటేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News