గోట్ మూవీ తీసింది వారి కోసమే: డైరెక్టర్

అయితే గోట్ మూవీ మంచి వసూళ్లు సాధిస్తుంటే.. సోషల్ మీడియాలో అనేక మంది ఇప్పటికీ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Update: 2024-09-09 22:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రీసెంట్ గా ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- ది గోట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 5వ తేదీన విడుదల అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ది గోట్ మూవీ.. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 280 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరిన్ని కోట్ల రూపాయలు వసూలు చేయనుంది.

అయితే గోట్ మూవీ మంచి వసూళ్లు సాధిస్తుంటే.. సోషల్ మీడియాలో అనేక మంది ఇప్పటికీ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. సినిమాను తెరకెక్కించింది ప్రేక్షకుల కోసమేనని తెలిపారు. విమర్శకుల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. మూవీ తీసేందుకు తాము పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించరని అన్నారు. కొందరు సినిమాపై కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు.

అదే సమయంలో గోట్‌ మూవీలో ఉన్న రిఫరెన్స్‌లు గురించి కూడా మాట్లాడారు. గోట్ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ ఉండవని చెప్పారు. ఏ హీరో ఫ్యాన్ అయినా.. కచ్చితంగా మూవీని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అలా చేశామని చెప్పారు. గెస్ట్ రోల్స్ కోసం సినిమాను తెరకెక్కించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆడియన్స్ ఎప్పుడూ కోరుకునే అన్ని అంశాలు స్టోరీలో ఉండేటట్టు రూపొందించామని తెలిపారు. అందరినీ మెప్పించే మూవీ తీయాలంటే చాలా టైమ్ కావాలని అన్నారు.

కాగా, ది గోట్ మూవీలో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటించగా.. ప్రశాంత్‌, వైభవ్‌, లైలా, స్నేహ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఐ సహాయంతో దివంగత నటుడు విజయ్ కాంత్ ను చూపించారు మేకర్స్. భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎంఎస్ ధోనీని ఒక్కో సీన్ లో అయినా చూపించాలని మేకర్స్ అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ను చూపించారు. అలా మిస్టర్ కూల్ ను స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశారు.

స్టోరీ లైన్ ఇదే...

సినిమాలో స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ గ్రూప్ ఏజెంట్ గా విజయ్(గాంధీ) పనిచేస్తుంటాడు. అయితే ఓ మిషన్ పనిమీద థాయ్ ల్యాండ్ కు వెళ్లగా.. అతని కుటుంబానికి సమస్య వస్తుంది. ఆ సమయంలో అతని కొడుకు చనిపోతాడు. దీంతో ఆ బాధతో జాబ్ వదిలేస్తాడు. భార్య ఏమో దూరం పెడుతుంది. అక్కడికి కొన్నేళ్ల తర్వాత మాస్కో వెళ్లగా.. గాంధీకి తన కొడుకు కనిపిస్తాడు. ఆ తర్వాత విజయ్ ఫ్యామిలీ మళ్లీ కలుస్తుంది. కానీ హీరో స్క్వాడ్ టీమ్ బాస్ చనిపోతాడు. టీమ్ లోని మిగతా వాళ్లను కూడా ఎవరో చంపేస్తారు. అసలు ఎవరు హత్యలు చేశారు? హీరో ఏం చేశాడు? గాంధీతో హత్యలకు లింకేంటి? అన్నదే మిగతా సినిమా.

Tags:    

Similar News