ఆ డైరెక్టర్ -స్పిన్ లెజెండ్ వైఫ్ క్లోజ్ ప్రెండ్స్!
తాజాగా లెజెండరీ స్పిన్నర్ ..శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వైఫ్- తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు మంచి స్నేహితులు అన్న విషయం లీకైంది.
సెలబ్రిటీలు-క్రికెటర్ల మధ్య రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు రంగాలమధ్య అవినాభవ సంబంధం ఉంది. ప్రేమికులుగా...స్నేహితులుగా కొనసాగుతున్నట్లు ఆ రెండు రంగాలకు సంబంధిం చిన వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కొన్ని పరిచయాలు మధ్యలో ఏర్పడితే..మరికొన్ని పరిచయాలు బాల్యం నుంచే కనిపిస్తుంటాయి. తాజాగా లెజెండరీ స్పిన్నర్ ..శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వైఫ్- తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు మంచి స్నేహితులు అన్న విషయం లీకైంది.
ముత్యయ్య సతీమణి మది మలర్- వెంకట్ ప్రభు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులట. శ్రీలంక వెళ్లినప్పుడు తప్పకుండా ఆకుటుంబాన్ని వెంకట్ ప్రభు కలుస్తారుట. అలాగే తమిళనాడు వెళ్లినా ముతయ్య కుటుంబ సభ్యులు కూడా దర్శకుడి ఇంటికి వెళ్తారుట.
ఆ రకంగా ఆ రెండు ఫ్యామిలీల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సేవా కార్యక్రమం కోసం వెంకట్ ప్రభుతో పాటు 800 దర్శకుడు శ్రీపతి కూడా శ్రీలంక వెళ్లారుట.
ఆ సమయంలో శ్రీపతి పరిచయం అయ్యారుట. అప్పటికే వెంకట్ ప్రభు తెలియడంతో ! ఈ కథని రాసే బాద్యతలు శ్రీపతికి అప్పగించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు చేయాలనుకు న్నారుట. కానీ శ్రీపతి ఉండటంతో ఆయన తప్పుకుని ఆ స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.ముత్తయ్య మురిళీ ధరన్ కథని తెరకెక్కించాలనుకున్నప్పడు ముందుగా ఆయన వద్దని వారించారుట.
కానీ పౌండేషన్ ద్వారా ఏదైనా సహాయం చేయడానికి బాగుంటుందని ముత్తయ్య మేనేజర్ ఒప్పించడంతో అంగీకరించా రుట. అలా శ్రీపతి కథ రాయడం...ఆ కథలో తనని ఎంతో ఓన్ చేసుకుని తీర్చిదిద్దడం ఆకట్టుకుందని ముత్తయ్య మురళీ ధరన్ తెలిపారు.
తన క్రికెట్ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం..బాల్యం ఎలా సాగింది? జీవితంలో మురళీ ధరన్ ఎదుర్కోన్న సవాళ్లను సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథలో ఎమోషన్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది.