సూర్య వెంకీ.. పెద్ద ప్లానింగే..!
సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య హీరోగా ఒక సినిమా వస్తుందని టాక్.
సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేశాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. అతని సినిమా అంటే చాలు సంథింగ్ స్పెషల్ అన్నట్టే అనుకునేలా తన సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఐతే వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య హీరోగా ఒక సినిమా వస్తుందని టాక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఐతే ఈ సినిమాను కూడా చాలా సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. సార్, లక్కీ భాస్కర్ సినిమాలు ఎప్పుడు మొదలు పెట్టాడో ఎప్పుడు పూర్తి చేశాడో తెలియదు. కానీ సినిమాలు మాత్రం సూపర్ హిట్లుగా నిలిచాయి. నెక్స్ట్ సూర్య సినిమా కూడా ఇలా సైలెంట్ గానే మొదలు పెట్టి తీస్తారని అంటున్నారు. వెంకీ సూర్య కాంబో మూవీ కచ్చితంగా వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
వెంకీ రాసుకుంటున్న కథలకు మన హీరోలు ఎవరు ఎందుకు ఓకే చెప్పట్లేదు అన్నది తెలియదు కానీ ఆ సినిమాల ఫలితాలు చూశాక మాత్రం మంచి కథ మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఆ హీరోలకు కలగక తప్పదు. ఐతే వెంకీ అట్లూరి ఈసారి సూర్యతో చేస్తున్న సినిమా కూడా వెరైటీగా ఉండబోతుందని తెలుస్తుంది. కథ ఎంత డిమాండ్ చేస్తే అంతగా తన వర్సటాలిటీ చూపించే సూర్య తన మార్క్ నటనతో మెప్పించాలని చూస్తున్నాడు. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ తో రెట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆర్జే బాలాజి డైరెక్షన్ లో సినిమా వస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి సినిమా ఉండొచ్చని తెలుస్తుంది. వెంకీ అట్లూరి, సూర్య ఈ కాంబో కచ్చితంగా ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చెప్పొచ్చు. కంగువ ఇచ్చిన షాక్ తో సూర్య వెరైటీ కథలతో మళ్లీ తన పూర్తి ఫోకస్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసారి వింటేజ్ కథలతో ఫ్యాన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తాయన్నది చూడాలి.